Man seeks approval: ఇంత వింతైన విజ్ఞప్తిని చాలా సీరియస్‌గా చేసిన వ్యక్తి..

అధికారులకు ఇటువంటి విజ్ఞప్తి రావడం ఇదే మొట్టమొదటిసారి.

mic

న్యూస్ పేపర్ ఆఫీసులో పనిచేస్తున్న వారిని తిట్టాలనుకుంటున్నానని, అందుకు తనకు రెండు గంటల పాటు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞాపన పత్రం సమర్పించారు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ అధికారులకు ఇటువంటి విజ్ఞప్తి రావడం ఇదే మొట్టమొదటిసారి.

తన పేరు ప్రతీక్ సిన్హా అని, న్యూస్ పేపర్ ఆఫీసు ముందు మైకు పెట్టి మరీ ఆ అధికారులను తిడతానని ప్రభుత్వ అధికారులను కోరారు. ఎటువంటి కారణమూ లేకుండా తన ప్రాపర్టీపైకి జనవరి 9న బుల్డోజర్లను పంపి చర్యలు తీసుకున్నారని అధికారులకు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో ప్రతీక్ సిన్హా పేర్కొన్నారు.

తన ప్రాపర్టీ గురించి న్యూస్ పేపర్‌లో ఆధారాలు లేకుండా వార్త రాశారని, తనను మాఫియాగా చిత్రీకరించారని చెప్పారు. తన గౌరవానికి భంగం కలిగించారని అన్నారు. అందుకు జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు ఆ న్యూస్ పేపర్ బ్యూరో చీఫ్, రిపోర్టర్‌ను రెండు గంటల పాటు తిడతానని చెప్పారు.

ఆ న్యూస్ పేపర్ ఆఫీసు ముందు తాను ఎలాంటి హింస, బెదిరింపులకు పాల్పడబోనని అన్నారు. వారిపై బూట్లు కూడా విసిరివేయబోనని చెప్పారు. ఇంత వింతైన విజ్ఞప్తిని చాలా సీరియస్‌గా చేసి వార్తల్లోకెక్కారు ప్రతీక్ సిన్హా.

Prabhas : రేపు పొద్దున్నే బీమవరంలో.. కోడి పందాల వద్ద డిజిటల్ ప్రభాస్ జాతర.. మారుతి సినిమా కోసం..