Prabhas : రేపు పొద్దున్నే బీమవరంలో.. కోడి పందాల వద్ద డిజిటల్ ప్రభాస్ జాతర.. మారుతి సినిమా కోసం..
ఇటీవలే ప్రభాస్ మారుతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపారు.

Prabhas Maruthi Movie Title Launch with Huge Digital Cutout in Bhimavaram for Sankranthi
Prabhas : ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత సలార్(Salaar) సినిమాతో భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా భారీ లైనప్ పెట్టాడు. ఈ లైనప్ లో ఓ లవ్ కమర్షియల్ సినిమా కూడా ఉంది. మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగం అయిపోయింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా టైటిల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చి అభిమానులని ఖుషి చేసింది. భీమవరం(Bhimavaram) అంటే ప్రభాస్ ఫ్యాన్స్ గడ్డ అని తెలిసిందే. ప్రభాస్ సొంతూరు కావడంతో టైటిల్ లాంచ్ కూడా అక్కడే జరగనుంది. ఇక సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలతో కళకళలాడుతుంది.
Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఏ ఓటీటీలోకి, ఏ ఛానల్ లోకి వస్తుందో తెలుసా?
దీంతో మొట్టమొదటిసారి ఎల్ఈడీలతో డిజిటల్ కటౌట్ పెడుతున్నామని, భీమవరంలోని వెంపకాసి కోడి పందెం బరి, పెదమేరంలో ప్రభాస్ డిజిటల్ కటౌట్ పెట్టి రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దాన్ని లాంచ్ చేసి టైటిల్ కూడా ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపారు. ఇంకేముంది భీమవరం, చుట్టుపక్కల అభిమానులు అంతా భీమవరంలోని ఆ ఏరియాకు రేప్పొద్దున్నే వెళ్ళడానికి రెడీ అయిపోయారు. రేపు పొద్దున్న ప్రభాస్ డిజిటల్ కటౌట్ ఎలా ఉంటుంది, టైటిల్ ఏం ప్రకటిస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాజా డీలక్స్, రాజా సాబ్ అనే టైటిల్ ఉండబోతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
The first-ever Huge Led digital cutout launch event is gearing up for a momentous revelation❤??
?️Jan 15th @ 6:30 AM⏰
?Vempa Kasi Kodi Pandem Bari
Pedameram, BhimavaramGet ready for #PrabhasPongalFeast ?#Prabhas
A @DirectorMaruthi film. @vishwaprasadtg… pic.twitter.com/hDHQ9pn231— People Media Factory (@peoplemediafcy) January 14, 2024