Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఏ ఓటీటీలోకి, ఏ ఛానల్ లోకి వస్తుందో తెలుసా?

నా సామిరంగ నేడు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివెంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలా నా సామిరంగని తెరకెక్కించారు.

Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఏ ఓటీటీలోకి, ఏ ఛానల్ లోకి వస్తుందో తెలుసా?

Nagarjuna Naa Saami Ranga Movie OTT Satellite Partner Full Details

Updated On : January 14, 2024 / 4:55 PM IST

Naa Saami Ranga : విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ సినిమా నేడు జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేయగా.. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి.

ఇక నా సామిరంగ నేడు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివెంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలా నా సామిరంగని తెరకెక్కించారు. ఈ పండక్కి మంచి ఎంటర్టైనింగ్ సినిమా ఇచ్చారు నాగ్. ఇక నా సామిరంగా సినిమా డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు కూడా రిలీజ్ కి ముందే అమ్ముడు పోయాయి.

Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ.. సంక్రాంతి పండక్కి పండగలాంటి సినిమా..

నా సామిరంగ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ భారీ ధరకు కొనుక్కున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చ్ మొదటి వారంలో ఈ సినిమాని ఓటీటీలో తీసుకొస్తుంది డిస్నీప్లస్ హాట్‌స్టార్. ఇక నా సామిరంగ శాటిలైట్ హక్కులు స్టార్ మా కొనుక్కుంది.