Dowry Harassment: కట్నం డబ్బులు ఇవ్వలేనోడికి నాకు పెళ్లెందుకు చేశార్రా?.. అక్క మాటలకు పాపం ఆ తమ్ముడు..

అదనపు కట్నం వేధింపులు(Dowry Harassment) కేవలం ఆడబిడ్డలనే కాదు, ఒక్కోసారి వారి కుటుంబాలలోని మగవారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటాయనే దానికి ఈ ఘటనే నిదర్శనం.

Young man commits suicide in Jawahar Nagar over dowry demands by sister and brother-in-law.

  • అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులు.
  • ఖాళీ చెక్కులపై బలవంతంగా సంతకాలు
  • మనస్తాపంతో గోదాంలో ఆత్మహత్య.

Dowry Harassment: అదనపు కట్నం వేధింపులు కేవలం ఆడబిడ్డలనే కాదు, ఒక్కోసారి వారి కుటుంబాలలోని మగవారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటాయనే దానికి ఈ ఘటనే నిదర్శనం. జవహర్ నగర్ పరిధిలోని చెన్నాపురానికి చెందిన నవీన్ (29) అనే ప్రైవేటు ఉద్యోగి, తన సోదరి అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక, బాధ్యుల మానసిక వేధింపులకు గురై మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కట్నపిశాచుల వేధింపులు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Ap Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ సోదరి మమతకు మొదటి భర్తతో విడాకులు కావడంతో, తుర్కయంజాల్‌కు చెందిన బొమ్మరాజు కృష్ణతో రెండో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 5 తులాల బంగారం, అర కిలో వెండితో పాటు కట్న(Dowry Harassment)కానుకలు సమర్పించారు. అయినప్పటికీ, అదనపు కట్నం కావాలంటూ మమత భర్త, అత్తమామలు నవీన్‌ను, అతని కుటుంబాన్ని నిరంతరం వేధించేవారు. ‘కట్నం ఇవ్వలేనప్పుడు నువ్వు బతికి దండగ, చనిపోతే నీ ఆస్తి వాటాను కట్నంగా తీసుకుంటాం’ అంటూ తరచూ అత్యంత దారుణంగా మాట్లాడేవారని సమాచారం.

ఈ క్రమంలోనే జూన్ 5వ తేదీన బావ కృష్ణ, సోదరి మమత కలిసి నవీన్ నుండి కొన్ని ఖాళీ చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి, తీవ్ర ఒత్తిడికి లోనైన నవీన్, శనివారం తాను పనిచేస్తున్న గోదాంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నవీన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ డిమాండ్ చేస్తున్నారు.