Banana Thrown At Brazil Star: ఫుల్‌బాల్ ఆటగాడే లక్ష్యంగా మైదానంలోకి అరటిపండు విసిరేసిన వైనం.. వీడియో

బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు రిచర్లిసన్ లక్ష్యంగా మైదానంలోకి ఒకరు అరటిపండు విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేగాక, వాటర్ బాటిల్, మరో వస్తువును కూడా బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాళ్ల వైపునకు కొందరు విసిరేసినట్లు తెలుస్తోంది. దీన్ని జాత్యహంకార చర్యగా పేర్కొంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పారిస్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లో ఉత్తర ఆఫ్రికాలోని టునీషియాను బ్రెజిల్ 5-1 తేడాతో ఓడించింది.

Banana Thrown At Brazil Star: బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు రిచాలీసన్ లక్ష్యంగా మైదానంలోకి ఒకరు అరటిపండు విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేగాక, వాటర్ బాటిల్, మరో వస్తువును కూడా బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాళ్ల వైపునకు కొందరు విసిరేసినట్లు తెలుస్తోంది. దీన్ని జాత్యహంకార చర్యగా పేర్కొంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పారిస్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లో ఉత్తర ఆఫ్రికాలోని టునీషియాను బ్రెజిల్ 5-1 తేడాతో ఓడించింది.

ఆట జరుగుతోన్న సమయంలో బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు రిచాలీసన్ రెండు గోల్ సాధించగానే ఆ జట్టు ఆటగాళ్లు అందరూ ఒక్క దగ్గరకు వచ్చి సంబరం చేసుకున్నారు. అదే సమయంలో ఓ అరటి పండు వచ్చి వారి వద్ద పడింది. అనంతరం దాన్ని ఓ ఆటగాడు బయటకు తన్నాడు. తమ ఆటగాళ్ల వైపుగా అరటి పండు విసిరివేయడంపై దీనిపై బ్రెజిల్ ఫుట్ బాల్ ఫెడరేషన్ కూడా అభ్యంతరం తెలుపుతూ ట్విటర్ లో ఓ పోస్టు చేసింది.

జాత్యహంకారానికి వ్యతిరేకంగా తాము పోరాడుతూనే ఉంటామని పేర్కొంది. ఈ ఘటన గురించి తెలుసుకుని షాక్ అయ్యానంటూ ఆ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎడ్నాల్డో రోడ్రిగ్స్ ఓ ప్రకటన చేశారు. ఆ అరటి పండు ఎవరు విసిరేశారన్న విషయాన్ని స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది కనిపెట్టలేకపోయారంటూ బ్రెజిల్ మీడియా విమర్శలు గుప్పించింది.

10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు