Viral Video: రైల్వే స్టేషన్ లో టీసీతో గొడవపడి కన్నీరు పెట్టుకున్న యువతి
రైల్వే స్టేషన్ లో టికెట్ చెకర్, మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ లో ఓ మహిళ ప్లాట్ ఫాంపై నిలబడి ఉంది. ఆమెతో టీసీ వాగ్వివాదానికి దిగాడు.
- T Venkateshwarlu
- Published on- March 16, 2023 / 08:58 AM IST
Viral Video
Viral Video: రైల్వే స్టేషన్ లో టికెట్ చెకర్, మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ లో ఓ మహిళ ప్లాట్ ఫాంపై నిలబడి ఉంది. ఆమెతో టీసీ వాగ్వివాదానికి దిగాడు.
వీడియోలో ఉన్న వివరాల ప్రకారం… “నువ్వు ఎందుకు నన్ను తిడుతున్నావు. నేను టికెట్ బుక్ చేసుకున్నాను. అందుకే ఇక్కడ ఉన్నాను” అని ఆ మహిళ టీసీతో వాదించింది. ఆ సమయంలో ఆమె కన్నీరు పెట్టుకుంది. దీంతో టీసీ “టికెట్ చూపించి ముందుకు కదులు.. ఇది నా ఉద్యోగం” అని అన్నాడు.
ఆ ప్రయాణికురాలు కన్నీరు పెట్టుకుంటుండడంతో ఆమెకు మద్దతుగా తోటి ప్రయాణికులు టీసీని నిలదీశారు. “ఆ అమ్మాయి ఒంటరిగా ప్రయాణిస్తోంది. ఆమెను టీసీ తిడుతున్నాడు. ఆమె ఎవరో నాకు తెలియదు. అయితే, ఆమెను టీసీ తిడుతుండడం మాత్రం చూశాను” అని ఓ ప్రయాణికుడు అన్నాడు. తాను వేరే టికెట్ కలెక్టర్ కి అప్పటికే టికెట్ చూపించానని, మరో టీసీ వచ్చి తనను అడ్డుకున్నాడని బాధిత ప్రయాణికురాలు తెలిపింది. ఆ టికెట్ కలెక్టర్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు.
