AP Budget 2023-24 : రూ.2,79, 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన… Live Update
2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.

AP Budget 2023-24 : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023-24 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79, 279 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. శాఖల వారిగా కేటాయింపుల వివరాలను అసెంబ్లీలో బుగ్గన వెల్లడిస్తున్నారు.
LIVE NEWS & UPDATES
-
వ్యవసాయ బడ్జెట్ రూ. 41,436 కోట్లు..
ఏపీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. రూ. 41,436 కోట్ల రూపాయలతో ఏపీ వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ ను చదివి వినిపించారు. రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్బీకే సేవలు అందిస్తున్నామని, 8,837 ఆర్భీకే భవనాలు వివిధ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఆర్బీకేలను మరింత పటిష్ఠం చేసేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని, రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
-
అసెంబ్లీలో మహిళలపై కవిత ..
ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలకోసం రూ. వెయ్యికోట్లు కేటాయించామని, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి రూ. 200 కోట్లు, అమ్మఒడి పథకానికి రూ. 6,500 కోట్లు కేటాయింపులు జరిపినట్లు బుగ్గన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలపై సభలో మంత్రి బుగ్గన కవితను చదివి వినిపించారు. అయితే, సభలో స్పందన రాకపోవటంతో మంత్రి మహిళా సభ్యులవైపు చూస్తూ ఏమ్మా మళ్లీ కవితను చదివి వినిపించనా అంటూ సూచించారు.. స్పందించిన మహిళా సభ్యులు వెంటనే చప్పట్లతో అభినందనలు తెలిపారు. మరోసారి మంత్రి కవితను చదివి వినిపించారు. ‘ మహిళలు స్ఫూర్తి ప్రధాతలు.. తమ అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు.. మహిళలు ప్రకృతికి మరో రూపాలు.. మహిళలు మహిలో నడయాడే ఆదిపరాశక్తులు.. అంటూ మంత్రి అన్నారు.
-
విశాఖపట్టణంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.13.42 లక్షలకుపైగా కోట్ల పెట్టుబడులకు సంబంధించి 378 ఒప్పందాలు జరిగాయని, దీని వల్ల ఆరు లక్షల మందికి ఉద్యోగవకాశాలు దక్కుతాయని ఆర్ధిక మంత్రి అసెంబ్లీలో తెలిపారు.
-
మౌలిక వసతులు, పెట్టుబడులు రూ. 1295 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యంకు రూ. 2602 కోట్లు.
గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
ఐటీ రంగానికి రూ. 215 కోట్లు.
కార్మిక శాఖకు రూ.796 కోట్లు.
న్యాయ శాఖకు రూ. 1058 కోట్లు.
శాసన సభ సెక్రటేరియట్ వ్యవహారాలకు రూ. 111 కోట్లు.
పట్టణాభివృద్ధి శాఖకు రూ. 9381 కోట్లు.
మైనారిటీల సంక్షేమంకు రూ. 2240 కోట్లు.
పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్‌కు రూ. 1.67 కోట్లు.
-
పశు సంవర్ధక శాఖ - రూ. 1787 కోట్లు.
పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు - రూ. 685 కోట్లు.
ఉన్నత విద్యకు - రూ. 2065 కోట్లు.
ఇంధన శాఖకు - రూ. 6546 కోట్లు.
మాధ్యమిక విద్యకు రూ. 29,691 కోట్లు.
అగ్రవర్ణ పేదల సంక్షేమంకోసం రూ. 11,085 కోట్లు.
సివిల్ సప్లయ్ - రూ. 3725 కోట్లు.
ఆర్థిక శాఖకు - 72,424 కోట్లు.
గ్రామ, వార్డు సచివాలయాలు శాఖకు - 3,858 కోట్లు.
హోంశాఖకు - 8,206 కోట్లు.
హౌసింగ్‌కు - 6,292 కోట్లు.
ఇరిగేషన్‌కు రూ. 11,908 కోట్లు.
-
వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో రూ. 2లక్షల 79వేల279 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
-
పాఠశాలల్లో విద్యను మెరుగుపర్చడమే కాకుండా, మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా డిజిటల్ కంటెన్ట్‌ను ప్రవేశపెట్టి మిశ్రమ ఫలితాలను సాధించాలని ప్రాతిపాదించడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక దృశ్య మాద్యమ తరగతులు, విద్యకు పునాదులువేసే ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీ గదులను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ చెప్పారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు 60వేల ట్యాబులను, సీబీఎస్ఈ సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4లక్షల60వేల ట్యాబులను పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు.
-
ఏపీ శాసన మండలిలో టీడీపీ ఆందోళన ..
ఏపీ శాసన మండలిలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పాల పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం పూర్తిగానాశనం చేసిందని, ఏపీలో అమూల్ సంస్థకు కట్టబెట్టిందని అన్నారు. ఫలితంగా స్థానిక పాల పరిశ్రమలను తీవ్రంగా నష్టాలు పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అంతేకాక, ఏపీ బడ్జెట్ అంతా బూటకాల బడ్జెట్ అంటూ శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్లే కార్డులు పట్టుకొని ఆందోళన చేశారు.
-
జగనన్న చేదోడు రూ. 350కోట్లు
జగనన్న విద్యాదీవెన - రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతిదీవెన - రూ.2,200 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు - రూ.500 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,212 కోట్లు.
లా నేస్తంకు రూ.17 కోట్లు.
ఈబీసీ నేస్తంకు రూ.610 కోట్లు.
నాడు- నేడు పథకానికి రూ.3,500కోట్లు.
వైఎస్సార్ చేయూత పథకానికి రూ.5వేల కోట్లు.
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి రూ. 50 కోట్లు.
ఈబీసీ నేస్తంకు రూ. 610 కోట్లు.
అమ్మఒడి పథకానికి రూ. 6,500 కోట్లు.
మొత్తం డీబీటీ స్కీంలకు రూ. 54,228.36 కోట్లు.
ధర స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లు.
-
వైఎస్ఆర్ వాహన మిత్ర రూ. 275 కోట్లు.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంకు రూ. 125 కోట్లు.
వైఎస్ఆర్ - పీఎం బీమా యోజన పథకంకు రూ. 1600 కోట్లు.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు.
వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 550 కోట్లు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంకు రూ. 21,434.72 కోట్లు.
వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 4,020 కోట్లు
వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా పథకానికి రూ.6,700కోట్లు
-
వ్యవసాయంకు రూ. 11,589.48 కోట్లు.
వైద్య ఆరోగ్య శాఖ కు రూ. 15,882.34 కోట్లు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873.83 కోట్లు.
విద్యుత్ శాఖకు రూ. 6,546.21 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ. 29,690.71 కోట్లు.
ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీకి రూ. 9,118.71 కోట్లు.
బ్రాహ్మణ కార్పొరేషన్ - రూ. 346.78 కోట్లు
మైనార్టీ కార్పొరేషన్ రూ. 1,868.25 కోట్లు
-
SC కార్పొరేషన్‌కు 8384.93 కోట్లు.
ST కార్పొరేషన్‌కు 2428 కోట్లు.
బీసీ కార్పొరేషన్‌లకు 22,715 కోట్లు.
ఈబీసీ కార్పొరేషన్ కు 6165 కోట్లు.
కాపు కార్పొరేషన్ 4887 కోట్లు.
క్రిస్టియన్ కార్పొరేషన్ కు 115.03 కోట్లు.
బ్రాహ్మణ కార్పోరేషన్ 346.78 కోట్లు.
మైనారిటీ కార్పొరేషన్ 1868.25 కోట్లు.
-
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న బుగ్గన..
రూ. 2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన.
రెవెన్యూ వ్యయం - 2,28,540 కోట్లు,
మూల ధన వ్యయం - 31,061 కోట్లు
రెవెన్యూ లోటు - 22,316 కోట్లు
ద్రవ్య లోటు - 54,587 కోట్లు
జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు - 3.77 శాతం
ద్రవ్య లోటు - 1.54 శాతం.
-
స్పీకర్ పోడియంను చుట్టముట్టిన టీడీపీ సభ్యులు. స్పీకర్ వారించినా వినకపోవటంతో ఒకరోజు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్.
-
అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరిన ఆర్థికమంత్రి రాజేంద్రనగర్ రెడ్డి.
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు.
-
బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం ..
ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం కేబినెట్ భేటీ జరిగింది. 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
-
పేద వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ..
ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2023-24 వార్షిక బడ్జెట్ లో పేద, బలహీన వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ అన్నారు. వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నామని, పరిపాలనాపరమైన మార్పులు చేసినా వాటికి కేటాయింపులు చేశామని తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను బలపరిచేలా, పథకాల ఫలాలు మరింత మందికి అందించేలా బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు బుగ్గన తెలిపారు.
-
సచివాలయంలో మరికొద్ది సేపట్లో క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10గంటలకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడతారు. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు.
-
2023 -24 వార్షిక బడ్జెట్ రూ. 2.79లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు.
-
మంత్రి బుగ్గన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తరువాత ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు.
-
శాసన మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు.
-
ఉదయం 10 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏపీ అసెంబ్లీలో 2023 - 24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన సచివాలయానికి చేరుకొని బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించారు.
AP Assembly Budget Session 2023-24