Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడు బంగారమే కొనక్కర్లేదు.. రూ.10 ఖర్చు చేసి ఇది కొన్నా.. మీ ఇంట కనక వర్షమే

Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడు బంగారమే కొనాల్సిన పని లేదు. చాలా తక్కువ ఖర్చులో లభించే మరి కొన్ని వస్తువులు కొన్నా అదృష్టం వరిస్తుంది.

akshaya tritiya 2026 instead of gold buy these low cost items for wealth and prosperity

Akshaya Tritiya 2026 : హిందువులు అతి పవిత్రంగా భావించే పర్వదినాల్లో అక్షయ తృతీయ ఒకటి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు వస్తుంది. అయితే అక్షయ తృతీయ నాడు కచ్చితంగా బంగారం కొనాలని చాలా మంది నమ్ముతారు. అందుకే అప్పు చేసి మరీ ఆ రోజు బంగారం కొంటుంటారు. మరి బంగారం కొనలేని వారి పరిస్థితి ఏంటి? వారికి కూడా అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి? దీనికి పండితులు చాలా సులువైన మార్గాలను సూచిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు వేలు, లక్షలు ఖర్చు చేసి బంగారం కొనాల్సిన పని లేదు. కేవలం రూ. 10 ఖర్చు చేసి కల్లుప్పు ప్యాకెట్ కొన్నా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, బంగారం కొన్నప్పుడు ఎలాంటి ఫలితం కలుగుతుందో, ఈ వస్తువులను కొన్నప్పుడు కూడా అదే ఫలితం కలుగుతుంది.

లక్ష్మీ స్వరూపం – కల్లుప్పు

ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. పైగా క్షీర సాగర మధనంలో లక్ష్మీ దేవితో పాటు ఉద్భవించిన వస్తువుల్లో కల్లుప్పు (సముద్రపు ఉప్పు) కూడా ఒకటి. అందుకే దీన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు, పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొన్నా అంతే ఫలితం లభిస్తుంది. ఈ ఉప్పు ప్యాకెట్‌ను ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.

ఇతర శుభప్రదమైన వస్తువులు:

బార్లీ (యవలు): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ నాడు ఉప్పు మాత్రమే కాక, బార్లీ (యవలు) కొనడం కూడా బంగారం కొనుగోలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. వీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు.

మట్టి కుండ: అక్షయ తృతీయ నాటికి ఎండలు మండిపోతుంటాయి. కనుక ఈ రోజు కొత్త మట్టి కుండను ఇంటికి తెచ్చుకోవడం లేదా చల్లని నీటితో నింపిన కుండను దానం చేస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది. ఇది జాతకంలోని దోషాలను తొలగించి మనశ్శాంతిని చేకూరుస్తుంది.

వెండి వస్తువులు: వెండి నాణేలు లేదా చిన్న వెండి పాత్రలను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

తామర గింజలు, గవ్వలు: లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలు లేదా గవ్వలను (Cowrie shells) పూజా స్థలంలో ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు పెరుగుతాయి.

దక్షిణావర్తి శంఖం: అక్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖాన్ని కొనుగోలు చేసి, పూజా గదిలో ఉంచి నిత్యం ఆరాధిస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడంలేదు.