Chandrayaan 3: ఇంత గొప్పవారు బొట్టుబిళ్ల, కుంకుమ, మంగళ సూత్రంతో..: హీరోయిన్ కంగన
ఈ ఫొటోలో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చీరలు ధరించి సంప్రదాయబద్ధంగా కనపడుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ..
- T Venkateshwarlu
- Published On : August 27, 2023 / 07:09 PM IST
Kangana Ranaut lauds women scientists
Chandrayaan 3 – Kangana Ranaut: చంద్రయాన్-3 ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఇస్రో (ISRO) మహిళా శాస్త్రవేత్తలు భారతీయ సంప్రదాయాలను ఎంతగా పాటిస్తున్నారో తెలుపుతూ సినీ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) స్టోరీస్ లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇటీవల ఇస్రో చంద్రయాన్-3 ల్యాండర్ ను జాబిల్లిపై విజయవంతంగా దింపిన విషయం తెలిసిందే. తాజాగా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు.
కంగనా రనౌత్ ఇస్రో మహిళా శాస్త్రవేత్తలపై స్పందిస్తూ.. ‘ భారత ప్రధాన శాస్త్రవేత్తలు వీరు.. వీళ్లలో ప్రతి ఒక్కరూ బొట్టుబిళ్ల, కుంకుమ, మంగళ సూత్రంతో కనపడుతున్నారు. నిరాడంబర జీవితం గడుపుతూ, ఉన్నతంగా ఆలోచించే విధానానికి వీరు ప్రతీక. నిజమైన భారతీయతా స్వభావం ఇదే ’ అని చెప్పారు.
Women scientists of Chandrayaan3
కాగా, ఈ ఫొటోలో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చీరలు ధరించి సంప్రదాయబద్ధంగా కనపడుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఫొటో దిగారు. అంత గొప్ప శాస్త్రవేత్తలు ఇంత నిరాడంబరంగా ఉంటున్నారని, వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏమీ లేనివారే ఎగిరెగిరి పడతారని, గొప్పవారు చాలా సింపుల్ గా ఉంటారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
Chandrayaan 3: చంద్రుడిపై మాకు ఆ హక్కు ఉంది.. ఇతర దేశాలూ పేర్లు పెట్టుకున్నాయి: ఇస్రో ఛైర్మన్
