×
Ad

Apple iPhone 16e : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16e అతి చౌకైన ధరకే.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!

Apple iPhone 16e : ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16e భారీ తగ్గింపు ధరతో లభ్యమవుతుంది. ఫ్లాగ్‌షిప్ మోడల్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.

Apple iPhone 16e

Apple iPhone 16e : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. మీ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. బ్యాంక్ ఆఫర్‌లతో సరసమైన ధరకే ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16e కొనేసుకోవడమే బెటర్. ఫెస్టివల్ సేల్ ఆఫర్ల కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ 16e డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16e ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఐఫోన్ 16e రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ రూ. 8,410 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. బేస్ ధర రూ. 51,490కి తగ్గింది. లాంచ్ సమయంలో కన్నా బ్యాంక్ ఆఫర్లతో ఈఎంఐ లావాదేవీలపై అత్యంత సరసమైన ధరకే కొనేసుకోవచ్చు.

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ కొనుగోలుదారులు అదనంగా రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 48,490కి తగ్గుతుంది. అసలు లాంచ్ ధరతో పోలిస్తే.. రూ. 11,410 సేవ్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడింగ్ చేస్తే.. ఫోన్ వర్కింగ్ కండిషన్ మోడల్ బట్టి ఫైనల్ అమౌంట్ కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Best Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్ డోంట్ మిస్.. 2025లో రూ. 25వేల లోపు 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు ఇవే.. ఇప్పుడే కొనేసుకోండి!

ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ A18 చిప్‌సెట్ కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్ చేస్తున్నా క్యాజువల్‌గా గేమింగ్ చేస్తున్నా లేదా ఏఐ ఆధారిత ఫీచర్‌ల కోసం చూస్తున్నా ఐఫోన్‌ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లాగ్‌షిప్ మోడల్‌‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.

కెమెరా విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ సెన్సార్‌, 2x ఆప్టికల్ జూమ్‌ కలిగి ఉంది. ఫోటోలు, వీడియోలతో పాటు సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. అల్యూమినియం బిల్డ్ ఫోన్‌ అత్యంత ప్రీమియంగా అనిపిస్తుంది.

ఇందులో ఫేస్ ఐడీ సేఫ్ అథెంటికేషన్ కూడా అందిస్తుంది. ఐఫోన్ 16e మోడల్ USB-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ కలిగి ఉంది. ఆపిల్ ఇమేజ్ క్లీనప్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, రైటింగ్ టూల్స్ ఇంటర్నల్ చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్‌తో సహా అనేక ఏఐ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది.