Best Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్ డోంట్ మిస్.. 2025లో రూ. 25వేల లోపు 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు ఇవే.. ఇప్పుడే కొనేసుకోండి!

Best Realme Phones 2025 : రియల్‌మి లవర్స్ మీకోసమే.. 2025లో రూ. 25వేల లోపు ధరలో కొనుగోలు చేయగల 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

Best Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్ డోంట్ మిస్.. 2025లో రూ. 25వేల లోపు 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు ఇవే.. ఇప్పుడే కొనేసుకోండి!

6 Best Realme Phones

Updated On : December 25, 2025 / 3:29 PM IST

Best Realme Phones 2025 : మీ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు రియల్‌మి ఫోన్ యూజర్లు అయితే ఇది మీకోసమే.. రూ. 25వేల లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి ఫోన్‌ల
లిస్టు మీకోసం అందిస్తున్నాం. ఇందులో రియల్‌మి 15T, రియల్‌మి P4, రియల్‌మి P4 ప్రో, రియల్‌మి 15, రియల్‌మి నార్జో 80 ప్రో, రియల్‌మి P3 అల్ట్రా ఉన్నాయి.

ఈ ఫోన్లలో అద్భుతమైన డిస్‌ప్లేలు, కెమెరా కెపాసిటీతో పాటు ల్యాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. సరసమైన ధర వద్ద క్వాలిటీ కోరుకునే ఎవరికైనా ఈ ఫోన్లను కొనేసుకోవచ్చు. 2025 లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఓసారి లుక్కేయండి..

రియల్‌మి 15T (రూ. 22,999) :
రియల్‌మి 15T ఫోన్ 1B కలర్ ఆప్షన్లు, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కూడా అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6400 Max చిప్‌సెట్‌తో 60W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్, షార్ప్ క్లియర్ క్లిక్‌ల కోసం 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

​రియల్‌మి P4 (రూ. 17,999) :
రియల్‌మి P4 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1B కలర్ ఆప్షన్లు, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో అమర్చి 80W వైర్డ్ ఛార్జింగ్‌తో భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్, ప్రతి క్లిక్‌తో క్వాలిటీ షాట్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అమర్చి ఉన్నాయి.

​రియల్‌మి P4 ప్రో (రూ. 22,999):
రియల్‌మి P4 ప్రో ఫోన్ 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1B కలర్ ఆప్షన్లు, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. క్వాల్కమ్ SM7750-AB స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో 80W వైర్డ్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి ఫోన్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ మల్టీఫేస్ ప్రో-లెవల్ పిక్చర్ క్వాలిటీ కోసం 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Read Also : Best AI Phones : వారెవ్వా.. కొత్త ఏఐ ఫోన్లు కేక.. రూ. 35వేల లోపు 5 బెస్ట్ AI ఫోన్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి

రియల్‌మి 15 (రూ. 24,999) :
రియల్‌మి 15 ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ 1B కలర్ ఆప్షన్లు, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరా పరంగా ఈ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ద్వారా 50MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.

రియల్‌మి నార్జో 80 ప్రో (రూ. 19,998) :
రియల్‌మి నార్జో 80 ప్రో 6.72-అంగుళాల OLEDడిస్‌ప్లే, 1B కలర్ ఆప్షన్లు, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో ఆధారితమైన 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా సెటప్, రోజువారీ ఫొటోగ్రఫీకి క్లియర్ ఫొటోల కోసం 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి P3 అల్ట్రా (రూ. 21,999) :
రియల్‌మి P3 అల్ట్రా ఫోన్ 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1B కలర్ ఆప్షన్లు, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ కెమెరా క్వాలిటీని కలిగి ఉంది. ఫొటోగ్రఫీ కోసం 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.