Best AI Phones : వారెవ్వా.. కొత్త ఏఐ ఫోన్లు కేక.. రూ. 35వేల లోపు 5 బెస్ట్ AI ఫోన్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి

Best AI Phones : భారత మార్కెట్లో సరికొత్త ఏఐ ఫీచర్లతో 5 బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 35వేల లోపు ధరలో ఈ ఏఐ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best AI Phones : వారెవ్వా.. కొత్త ఏఐ ఫోన్లు కేక.. రూ. 35వేల లోపు 5 బెస్ట్ AI ఫోన్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి

Best AI Phones

Updated On : December 25, 2025 / 2:48 PM IST

Best AI Phones : కొత్త AI స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్‌ ధరలోనే అద్భుతమైన ఏఐ ఫీచర్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. మీరు మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఈ ఫోన్‌లు అద్భుతమైన ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి.

లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి. ఏఐ టూల్స్ అందించే కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ ఏఐ ఫోన్ ఎంచుకోండి. మీ బడ్జెట్‌లోనే ప్రీమియం ఎక్స్ పీరియన్స్ పొందండి..

షావోమీ 14 సివి (రూ. 36,999) :
షావోమీ 14 సివి ఫోన్ 6.55-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 68B కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్‌ ఆప్షన్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌గా HyperOS కలిగి ఉంది. ఈ యూనిట్ డ్యూయల్ 32MP ఏఐ సెల్ఫీ కెమెరాతో 50MP + 50MP + 10MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏఐ ఆధారిత కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఏఐ ఫేస్ అన్‌లాక్‌తో కూడా వస్తుంది.

​నథింగ్ ఫోన్ 3a ప్రో (రూ. 28,999) :
నథింగ్ ఫోన్ 3a ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ఉంది. నథింగ్ OS 4.0పై రన్ అవుతుంది. 1B కలర్ ఆప్షన్లు, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 50MP వెడల్పు, 50MP పెరిస్కోప్ టెలిఫోటో 8MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. సర్కిల్ టు సెర్చ్, ఏఐ న్యూస్ రిపోర్టింగ్ విడ్జెట్ వాల్‌పేపర్ స్టూడియో కస్టమైజడ్ వంటి వివిధ రకాల ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.

పోకో F7 (రూ. 31,999) :

పోకో F7 ఫోన్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ హైపర్OS2పై రన్ అవుతుంది. 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది.

Read Also : Top 5 Smartphones : ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. 2025లో రూ.10వేల లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

ఏఐ ఫేస్ అన్‌లాక్, ఏఐ ఎడిటింగ్ ఫీచర్‌లు ఏఐ బ్యూటిఫైని కలిగి ఉంది. అద్భుతమైన ఫొటోలను క్లిక్ చేయొచ్చు. ఏఐ సెర్చ్, ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్‌ను కూడా కలిగి ఉంది. స్పీకర్ ద్వారా స్పీచ్ ఆటోమాటిక్ టెక్స్ట్‌గా మార్చేస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (రూ. 29,483) :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 1B కలర్స్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్‌తో ఈ యూనిట్ 50MP + 10MP + 50MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. మోటో ఏఐ ఫీచర్ కలిగి ఉంది నోట్స్, స్క్రీన్‌షాట్‌లు, వర్క్ సెంట్రలైజడ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 5 (రూ. 33,999) :
వన్‌ప్లస్ నార్డ్ 5 డ్యూయల్ 50MP + 8MP కెమెరాతో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6.83-అంగుళాల స్విఫ్ట్ అమోల్డ్ డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ఏఐ అన్‌బ్లర్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ రైటర్, ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ మరెన్నో వంటి వివిధ ఏఐ ఫీచర్లతో వస్తుంది.