Top 5 Smartphones : ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. 2025లో రూ.10వేల లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!
Top 5 Smartphones : కొత్త ఫోన్ కావాలా? 2025లో రూ. 10వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Top 5 Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీకోసం 2025 ఇయర్ ఇండ్ సందర్భంగా రూ. 10వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ముగిసేలోపు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. అతి తక్కువ ధరలో అనేక ఎంట్రీ-లెవల్ మోడల్‌లు లభ్యమవుతున్నాయి. ఆసక్తిగల వినియోగదారులు శాంసంగ్, రియల్‌మి, లావా వంటి కంపెనీల నుంచి సరికొత్త ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. 2025లో ఏయే స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత సరసమైనవి? ఏ ఎంట్రీ-లెవల్ మోడల్‌లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

లావా బోల్డ్ N1 : 6.75-అంగుళాల స్క్రీన్‌తో లావా ఫోన్ సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. ఈ లావా ఫోన్ ధర రూ. 7,999 ఉండగా ఆండ్రాయిడ్ 15-ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో యూనిసోక్ T765 సీపీయూ ద్వారా పవర్ పొందుతుంది.

శాంసంగ్ గెలాక్సీ F06 : శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 9,999కు పొందవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్, 6.7-అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉన్నాయి.

రియల్‌మి C71 : ఈ రియల్‌మి ఫోన్ 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. రూ. 8,699 తగ్గింపు ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇందులో 13MP కెమెరా, యూనిసోక్ T7250 ప్రాసెసర్ ఉన్నాయి.

వివో Y19e 5G : యూనిసోక్ T7225 చిప్‌సెట్, 64GB స్టోరేజీ వివో గాడ్జెట్ ఫీచర్లు కలిగి ఉంది. ఈ వివో ఫోన్‌లో 13MP కెమెరా, 5500mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 8,999 నుంచి అందుబాటులో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G : ఆగస్టులో లాంచ్ అయిన ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,999, 50MP కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
