Bharat Taxi vs Ola-Uber
Bharat Taxi vs Ola-Uber : సిటీ రైడర్లకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్ వంటి సర్వీసుల ఛార్జీలతో విసిగిపోయారా? డోంట్ వర్రీ.. జనవరి 1 నుంచి ప్రభుత్వ యాప్ భారత్ టాక్సీ అందుబాటులో వస్తోంది. ఇక సిటీలో క్యాబ్ సర్వీసులు వేగంగా బుకింగ్ చేసుకోవచ్చు. ఛార్జీలు కూడా మీ బడ్జెట్ ధరలోనే ఉంటాయి.
ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఎక్కడికి అని అడిగి తక్కువ ఛార్జీ పడితే రైడ్ క్యాన్సిల్ చేస్తుంటారు. చాలామంది ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఆఫీసు టైమింగ్స్, వర్షాలు లేదా ట్రాఫిక్ సమయాల్లో ఛార్జీలు భారీగా వసూలు చేస్తుంటారు.
మీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే ఇక ఆందోళన అవసరం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీలో ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ అమల్లోకి రానుంది. జనవరి 1, 2026 నుంచి దేశ రాజధానిలో భారత్ టాక్సీ యాప్ ప్రారంభం కానుంది. ఈ యాప్ కూడా మనమందరం రోజూ బుకింగ్ చేసుకునే ఓలా, ఉబర్ లాంటి యాప్. మన ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. భారత్ టాక్సీకి ఓలా, ఉబర్ వంటి ఇతర టాక్సీలకు మధ్య తేడా ఏంటి? ఛార్జీలు, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఓలా, ఉబర్ ఎలా పనిచేస్తాయో మనందరికీ తెలుసు. డిమాండ్ పెరిగిన వెంటనే ఛార్జీ రెట్టింపు అవుతుంది. చిన్నపాటి వర్షం పడినా రూ. 100 ట్రిప్పును రూ. 300 గా మారుస్తుంది. ఈ ఓలా, ఉబర్ కంపెనీలు దీనిని డైనమిక్ ప్రైసింగ్ విధానంగా చెబుతాయి. కానీ, సామాన్యుల నుంచి ఛార్జీల రూపంలో భారీగా వసూలు చేస్తాయి.
భారత్ టాక్సీలో ప్రత్యేకతలేంటి? :
ప్రభుత్వ యాప్ ఛార్జీల విషయంలో ఎలాంటి అస్పష్టత ఉండదు. రేట్లు ముందుగానే నిర్ణయించి ఉంటాయి. మీరు రద్దీ సమయాల్లో బుక్ చేసుకున్నా లేదా రాత్రి ఆలస్యంగా బుక్ చేసుకున్నా మీరు ముందుగా నిర్ణయించిన ఛార్జీని చెల్లిస్తారు. మీ ప్రయాణం చివరిలో మీకు రీజనబుల్ ఛార్జీనే ఉంటుంది.
ఓలా, ఉబర్ డైనమిక్ ధరల మోడల్‌పై పనిచేస్తాయి. అంటే వర్షం పడుతుంటే లేదా ఆఫీసు సమయం అయితే రూ. 100 ఛార్జీ నుంచి రూ.300కి పెరగవచ్చు. రిపోర్టుల ప్రకారం.. ఈ యాప్ ఫిక్స్డ్ ఫీజు సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. వర్షం, ట్రాఫిక్ లేదా రాత్రి సమయంతో సంబంధం లేకుండా మీరు ముందుగా నిర్ణయించిన ఛార్జీని చెల్లిస్తారు.
2. డ్రైవర్లకు ఆదాయం, రైడ్ క్యాన్సిల్ చేయరు :
డ్రైవర్లు ఆదాయం చాలా తక్కువగా భావించి రైడ్లను క్యాన్సిల్ చేసుకుంటారు. ప్రైవేట్ యాప్‌లు ఛార్జీ నుంచి 20శాతం నుంచి 25శాతం (కొన్నిసార్లు 30శాతం వరకు) కమీషన్‌ను తగ్గిస్తాయి. భారత్ టాక్సీ మోడల్లో అయితే 80 శాతం కన్నా ఎక్కువ ఛార్జీ నేరుగా డ్రైవర్‌కే వెళ్తుంది. డ్రైవర్లు తమ పూర్తి ఆదాయాన్ని అందుకోవచ్చు. రైడ్ క్యాన్సిల్ బదులుగా రైడ్‌ను పూర్తి చేయడానికే డ్రైవర్లు ఎక్కువ మొగ్గు చూపుతారు.
3. సింగిల్ యాప్‌తో అన్ని రైడ్స్ :
కొన్నిసార్లు మనకు ఆటో మాత్రమే అవసరం. కానీ, యాప్ ఖరీదైన కార్లను మాత్రమే చూపిస్తుంది. మనకు బైక్ టాక్సీ అవసరం కావచ్చు. భారత్ టాక్సీలో అయితే సూపర్-అగ్రిగేటర్‌గా పనిచేస్తుంది. జనవరి 1 నుంచి మీరు ఆటో-రిక్షాలు, బైక్‌లు, కార్ల కోసం సింగిల్ స్క్రీన్‌పై ఆప్షన్లను చూడొచ్చు. ఢిల్లీలో దాదాపు 56వేల మంది డ్రైవర్లు ఇప్పటికే భారత్ టాక్సీలో చేరారు. వాహనాల కోసం వేచి ఉంటే సమయం కూడా తగ్గింది.
సాధారణంగా ప్రైవేట్ యాప్‌లలో బిల్లు అనేది బుకింగ్ ఫీజులు లేదా వెయిటింగ్ ఛార్జీలు ఉంటాయి. భారత్ టాక్సీలో లాభం కోసం కాకుండా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఛార్జీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. మీరు ఎంత ఛార్జీలు చెల్లిస్తున్నారో అదే ఉంటుంది. అంతకన్నా రూపాయి కూడా అదనంగా చెల్లించరు.
5. ఫిర్యాదులకు త్వరిత పరిష్కారం :
ప్రైవేట్ కంపెనీల కస్టమర్ కేర్ నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. మీరు రీఫండ్లు లేదా ఫిర్యాదుల కోసం అనేకసార్లు ఇమెయిల్‌లను పంపాల్సి వస్తుంది. భారత్ టాక్సీ విషయానికి వస్తే.. ప్రభుత్వ పర్యవేక్షణ కారణంగా ఫిర్యాదులు బాధ్యతాయుతంగా పరిష్కరించే అవకాశం ఎక్కువ. డ్రైవర్లు, ప్రయాణీకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.