ED Raids : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సోదాలు
ED Raids : ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత చెవిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 01:57 PM IST
ED raids in AP liquor scam case key accused and ycp leaders residences
ED Raids : విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలో శుక్రవారం ఈడీ అధికారులు వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. మొత్తం 10 బృందాలు ఏకకాలంలో హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంతో పాటు.. గోవింద రెడ్డి, భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఇళ్లలో కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. వీరి నివాసాలు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన నివేదికల ఆధారంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడతో పాటు హైదరాబాద్, తిరుపతిలో కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు.
