Koffee With Karan 8 : డేటింగ్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జాన్వీ కపూర్
కాఫీ విత్ కరణ్ 8 సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో చెల్లెలు ఖుషీతో జాన్వీ కపూర్ సందడి చేశారు. బాయ్ ఫ్రెండ్, డేటింగ్ విషయాలపై ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
- Lakshmi 10tv
- Published On : January 4, 2024 / 11:26 AM IST
Koffee With Karan 8
Koffee With Karan 8 : అందాల నటి శ్రీదేవి కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో కూడా బిజీ కాబోతున్నారు. తాజాగా కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్ 8’ వ సీజన్ గెస్ట్‌గా వచ్చిన జాన్వీ బాయ్ ఫ్రెండ్ రూమర్స్, డేటింగ్ విషయాలపై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్‌పై కేసు నమోదు.. మానసిక పరిస్థితి బాగోలేదంటూ..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ 8 వ సీజన్ నడుస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌కి జాన్వీ కపూర్, సోదరి ఖుషీ గెస్ట్‌లుగా వచ్చారు. రిలేషన్స్, సినిమాలు పలు అంశాలపై ఇద్దరూ మాట్లాడారు. కాగా ఈ ఎపిసోడ్‌లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. అంతేకాదు అసలు నటులతో ఎందుకు డేటింగ్ చేయాలనుకోవట్లేదో కూడా స్పష్టం చేసారు.
శిఖర్ పహారియాతో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు జాన్వీ కపూర్ శిఖర్ తన ఫ్యామిలీలో తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నారని సమాధానం చెప్పారు. శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తను నటులతో ఎందుకు డేటింగ్ చేయడానికి ఇష్టపడరో కూడా జాన్వీ స్పష్టం చేశారు. యాక్టింగ్ కెరియర్‌లో పూర్తిగా నిమగ్నమై ఉండాలని.. తనను ఇష్టపడే వ్యక్తి తనపట్ల శ్రద్ధ చూపడంతో పాటు, సమయం ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు. నటీనటుల విషయంలో అది కుదరదని.. ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారని.. ఏదో ఆందోళనలో ఉంటారని.. అలాంటి ఎమోషన్స్ తాను బ్యాలెన్స్ చేయలేనని చెప్పారు. ఓకే ప్రొఫెషన్‌లో ఉన్నవారితో డేటింగ్ కష్టమని చెప్పారు.
Amala Paul : మొన్ననే పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో అమలా పాల్..
‘నీ స్పీడ్ డయల్ లిస్ట్‌లో ఎవరుంటారని?’ కరణ్ అడిగిన ప్రశ్నకు జాన్వీ తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ.. తర్వాత శిఖర్ పహారియా పేరు చెప్పారు. కాగా జాన్వీ కపూర్ 2023 లో వరుణ్ ధావన్‌కి జోడిగా ‘బవాల్’ సినిమాలో నటించారు. తెలుగులో ఎన్టీఆర్‌కి జోడిగా ‘దేవర’ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వంశీ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు.. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సరసన కూడా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.
