Amala Paul : మొన్ననే పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో అమలా పాల్..
నటి అమలా పాల్ తన లవ్ ప్రపోజల్, పెళ్లి న్యూస్ ని ఎంత ఫాస్ట్ గా తెలియజేశారో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ తెలియజేశారు.

Actress Amala Paul announce her pregnancy with baby bump photos
Amala Paul : ఇటీవల నటి అమలా పాల్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అమలా పాల్ బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్.. ఆమెకు ప్రపోజ్ చేయడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. ఇక అలా ప్రపోజల్ కి ఒకే చెప్పిందో లేదో వెంటనే బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి పీటలు ఎక్కేసారు. వీరిద్దరి వివాహం కోచిలో నవంబర్ 5న ఘనంగా జరిగింది. ప్రపోజల్, పెళ్లి న్యూస్ ని ఎంత ఫాస్ట్ గా తెలియజేశారో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ తెలియజేశారు.
తాజాగా అమలా పాల్ తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. ఆ పోస్టులో అమలా పాల్ బేబీ బంప్ తో కనిపిస్తున్నారు. ఇక ఆ పోస్టుకి అమలా పాల్ ఇలా రాసుకొచ్చారు.. “నేను ఇప్పుడు నీతో కలిసి ముగ్గురు కాబోతున్నాము” అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు.. కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. మరికొంతమంది మాత్రం మొన్ననే కదా పెళ్లి అయ్యిందని ప్రశ్నలు వేస్తున్నారు.
Also read : Sasivadane Teaser : గోదావరి ఓడిలో మరో ప్రేమకథ.. లవ్లీగా ఉన్న ‘శశివదనే’ టీజర్ చూశారా..
View this post on Instagram
కాగా జగత్ దేశాయ్ తో అమలాపాల్ కి ఇది రెండో పెళ్లి. 2014 లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. విభేదాల కారణంగా 2017 లో అతడి నుంచి విడిపోయింది. ఆ తరువాత 2018 లో తన స్నేహితుడు సింగర్ భవీందర్ సింగ్‌ను అమలాపాల్ పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరికి పెళ్లి జరిగినట్లు ఓ ఫోటో కూడా మీడియాల్లో చక్కెర్లు కొట్టింది. అయితే ఆ ఫోటో ఓ షూట్‌లో భాగమని చెప్పి పెళ్లి వార్తలను కొట్టేసారు.
ఆ తర్వాత భవీందర్ సింగ్ తో కూడా విభేదాలు వచ్చి అమలా పాల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇక కొన్నాళ్లుగా జగత్ దేశాయ్‌తో డేటింగ్ చేస్తున్న ఈ భామ.. అతడితో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చి కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అయితే పెళ్ళికి ముందే అమలా పాల్ ప్రెగ్నెంట్ అయ్యినట్లు తెలుస్తుంది.