Sasivadane Teaser : గోదావరి ఓడిలో మరో ప్రేమకథ.. లవ్లీగా ఉన్న ‘శశివదనే’ టీజర్ చూశారా..

గోదావరి నేపథ్యంతో మరో మరో ప్రేమకథ రాబోతుంది. రక్షిత్, కోమలీ జంటగా నటిస్తున్న 'శశివదనే' చిత్రం టీజర్ నేడు రిలీజ్ చేశారు.

Sasivadane Teaser : గోదావరి ఓడిలో మరో ప్రేమకథ.. లవ్లీగా ఉన్న ‘శశివదనే’ టీజర్ చూశారా..

Rakshit Atluri Komalee Sasivadane movie Teaser released

Updated On : January 3, 2024 / 7:38 PM IST

Sasivadane Teaser : గోదావరి నేపథ్యంలో ఎన్ని ప్రేమకథలు వచ్చినా.. అవి చూడడానికి చాలా రీ ఫ్రెషింగా, అందంగానే ఉంటాయి. అలా ఒక అందమైన ప్రేమకథ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ‘పలాస 1978’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రక్షిత్ అట్లూరి.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక మన తెలుగు అమ్మాయి కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు.

గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి టీజర్ ని నేడు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ టీజర్ ని పూర్తి లవ్ కట్ తో రెడీ చేశారు. టీజర్ లో రక్షిత్, కోమలీ జంట ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా కోమలీ లుక్స్ శశివదనే టైటిల్ కి తగ్గట్టు చాలా బాగున్నాయి. టీజర్ లో చూపించిన సీన్స్ కూడా లవ్లీగా ఉన్నాయి.

ఇక టీజర్ లో చెప్పిన డైలాగ్స్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘గడిచే కాలంతో నేలపై నడిచే నా ప్రతి అడుగు ఇక పై నీతోనే’, ‘ఇన్ని రోజులు విడి పరుగు నా వెంట పడడమే అనుకున్నాను. కానీ వీడు వేరే’.. అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ కి అనుదీప్ దేవ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. శరవణన్ వాసుదేవన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి ఆ లవ్లీ టీజర్ ని మీరుకూడా చూసేయండి.

Also read :Salaar vs Dunki : 12 రోజులకు సలార్, డంకీ కలెక్షన్స్..? రెండిటి మధ్య తేడా ఎంత..?

కాగా ఈ చిత్రాన్ని సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే.. శశివదనే, డీజే పిల్లా సాంగ్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.