Salaar vs Dunki : 12 రోజులకు సలార్, డంకీ కలెక్షన్స్..? రెండిటి మధ్య తేడా ఎంత..?
12 రోజులకు సలార్, డంకీ కలెక్షన్స్ ఎంత వచ్చాయి. ప్రస్తుతం రెండిటి మధ్య తేడా ఎంత ఉంది..?

Prabhas Salaar Shah Rukh Khan Dunki movie 12 days collections report
Salaar vs Dunki : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ డైనోసార్స్ కావడంతో.. ఆడియన్స్ లో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ పై ఆసక్తి నెలకుంది. ఈక్రమంలోనే సలార్, డంకీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయని ఫ్యాన్స్ గమనిస్తూ వస్తున్నారు.
మరి ఈ రెండు చిత్రాలు రిలీజై దాదాపు రెండు వారలు పూర్తి కావొస్తున్నాయి. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఏంటి..? ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్దకి వచ్చి 12 రోజులు పూర్తి అయ్యింది. ఈ పన్నెండు రోజుల్లో ఈ రెండు చిత్రాలు ఎంత కలెక్ట్ చేశాయంటే.. సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 650 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. డంకీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 409 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు నిర్మాతలు తెలియజేశారు.
Also read : Manisharma : ఎన్టీఆర్ కోసం ఆ పాట కాపీ చేయమని బలవంతం చేశారు.. అందుకే ఆ మూవీలో..
Just another day of us celebrating your endless love for Dunki! ??
Book your tickets right away!https://t.co/DIjTgPqLDI
Watch #Dunki – In Cinemas Now! pic.twitter.com/gkpWG6Vp89
— Red Chillies Entertainment (@RedChilliesEnt) January 3, 2024
ఈ రెండు చిత్రాలు మధ్య దాదాపు 240 కోట్ల డిఫరెన్స్ ఉంది. మరి ఫుల్ రన్ కంప్లీట్ చేసుకునేప్పటికీ ఈ రెండు చిత్రాలు మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో చూడాలి. కాగా అటు ఓవర్ సీస్ లో కూడా షారుఖ్‌పై ప్రభాస్ పైచేయి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అమెరికాలో ఈ రెండు చిత్రాలు మధ్య 3M డాలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ 2 ప్లేస్‌ల్లో బాహుబలి 2, RRR ఉంటే.. మూడో స్థానాన్ని ఇప్పుడు సలార్ కైవసం చేసుకుంది.
కాగా మరోవారం వరకు తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ లు ఏమి లేవు. ఈ గ్యాప్ లో సలార్ చిత్రం.. మంచి కలెక్షన్స్ రాబట్టి 700 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం పక్కాగా కనిపిస్తుంది. అటు డంకీ చిత్రం కూడా 500 కోట్ల మార్క్ ని దాటాలని ప్రయత్నిస్తుంది. మరి ఆ మార్క్ ని క్రాస్ చేస్తుందా లేదా చూడాలి.