Manisharma : ఎన్టీఆర్ కోసం ఆ పాట కాపీ చేయమని బలవంతం చేశారు.. అందుకే ఆ మూవీలో..
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మణిశర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కోసం ఆ పాట కాపీ చేయమని బలవంతం చేశారంటూ..

Manisharma said he copied that Turkish song for NTR movie
Manisharma : చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ కి తమ కెరీర్ లో గుర్తుండిపోయే సూపర్ హిట్ ఆల్బమ్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ.. ప్రస్తుతం అవకాశాలు లేక బాధుపడుతున్నారు.గత కొంతకాలంగా మణిశర్మ అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సంగీత దర్శకుడు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈక్రమంలోనే ఎన్టీఆర్ కోసం ఓ పాటని బలవంతంగా కాపీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకీ అది ఏ సినిమాలోని పాట..? ఏ పాటకి కాపీగా వచ్చింది..? ఎన్టీఆర్ కెరీర్ లో తనకి మాస్ ఇమేజ్ తీసుకు వచ్చిన సినిమా అంటే.. వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆది’. ఫ్యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి మణిశర్మ ఇచ్చిన సంగీతం మరో హైలైట్ అనే చెప్పాలి.
Also read : Venkatesh : వెంకటేష్ కొడుకు సినిమా ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన వెంకీ మామ..
మూవీలోని ప్రతి సాంగ్ తో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ మూవీలోని ఓ సాంగ్ ని మణిశర్మ కాపీ చేయాల్సి వచ్చిందట. మూవీలోని మొదటి సాంగ్ ‘చిక్ చిక్ భం భం’ సాంగ్ ని మణిశర్మ కాపీ చేశారట. ఈ పాటని టర్కిష్ సాంగ్ ‘సిమరిక్’ నుంచి కాపీ చేశారు. మణిశర్మకి ఇష్టం లేకున్నా.. దర్శకనిర్మాతల బలవంతం మీద ఆ పాటని కంప్లీట్ గా కాపీ చేసేశారు. ఈ పాట గురించి మణిశర్మ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంటారు.
“I was forced to copy a song tune in NTR’s Aadi movie” – Manisharma. pic.twitter.com/Eoa0DDsjJK
— Bhagat Vailly? (@Only_PSPK) January 3, 2024
ఈ పాట మాత్రమే కాదు.. తన కెరీర్ లో ఇలా బలవంతం మీద కొన్ని పాటలని కాపీ కొట్టినట్లు పేర్కొన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడుతూ తన బాధని వ్యక్తం చేశారు. మణిశర్మ ఏమన్నారంటే.. “నేను హార్ట్ అయ్యేది దేనికంటే, మహేష్ పవన్ లాంటి స్టార్ హీరోలు అయినా అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. థమన్‌కి ఒకటి, దేవికి ఒకటి, నాకు ఒకటి. పోనీ వాళ్ళకి రెండు, నాకు ఒకటి ఇచ్చినా ఆడియన్స్ కి కొత్త కొత్త మ్యూజిక్ అన్ని రకాలు, వెరైటీ వస్తుంది” అంటూ అవకాశాలు రాకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు.