Uber Bill: 17కిలోమీటర్లకు ట్యాక్సీ బిల్లు చూసి షాకైన కస్టమర్!

చాలా మందికి వీకెండ్స్‌లో రాత్రిళ్లు స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం కదా? మద్యం తాగి వాహనం నడిపితే పట్టుకుంటున్నారు

Uber

Uber Bill: చాలా మందికి వీకెండ్స్‌లో రాత్రిళ్లు స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం కదా? మద్యం తాగి వాహనం నడిపితే పట్టుకుంటున్నారు అనే ఉద్ధశ్యంతో ఎక్కువగా క్యాబ్‌లను బుక్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే, అలా ట్యాక్సీ బుక్ చేసుకున్న వ్యక్తికి అయిన బిల్లు ఉదయాన్నే చూసుకుని షాక్ అయ్యాడు.

మాంచెస్టర్‌కు చెందిన సామ్ జార్జ్ తన స్నేహితులతో కలిసి డిసెంబర్ 27న నైట్ పార్టీకి వెళ్లాడు. పార్టీ ముగించుకుని మద్యం మత్తులో ఉబెర్ కాల్ ట్యాక్సీని బుక్ చేసుకొని పార్టీ జరుగుతున్న చోట నుంచి తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు Uber అతని బ్యాంక్ ఖాతా నుండి £ 104 అంటే భారతీయ కరెన్సీలో రూ. 10,413 బిల్లు కలెక్ట్ చేసింది.

పార్టీ జరిగిన ప్రాంతానికి ఆయన ఇల్లు కేవలం 17.7 కి.మీ. అటువంటప్పుడు అంత బిల్లు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. సాధారణంగా ఈ ట్రిప్‌కు గరిష్టంగా 25 పౌండ్లు వసూలు చేస్తారు, అయితే ఆ సమయంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ట్రామ్, ఇతర క్యాబ్‌లు వంటివి ఏమీ లేవు కాబట్టి Uber దీని ధరను పెంచింది. దీంతో బిల్లు నాలుగు రెట్లు పెరిగింది.

New Year Amazon Deal: రూ.65వేల OnePlus 9Pro 5G ఫోన్ 30వేలకే!

అయితే, కష్టమర్ ఆ సమయంలో బుక్ చేసుకున్నప్పుడు ఎంత అయ్యిందో చూసుకోలేదు. కారు బుక్ చేసుకుని ఎక్కేశాడు. మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వార్త వైరల్‌ అయ్యింది.