MAA Elections: మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు!

మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు..

Vishnu Crying

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన సందర్భంగా.. మంచు విష్ణు కంటతడి పెట్టారు. ప్రకాష్ రాజ్, నరేష్.. ఇతర ప్రముఖులు ఆయన్ను ఊరడించే ప్రయత్నం చేసినా.. భావోద్వేగాన్ని మంచు విష్ణు ఆపుకోలేకపోయారు.

కాసేపటి తర్వాత.. తనకు తానుగా సముదాయించుకున్న విష్ణును.. ప్రకాష్ రాజ్ ఆత్మీయంగా హత్తుకున్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని.. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలనీ.. మంచు విష్ణు చెప్పారు.