Mother’s dream: ‘‘ఎప్పుడు పైలట్ అవుతావు?.. విమానంలో ఎప్పుడు తీసుకెళ్తావు?’ అని 20 ఏళ్ల క్రితం అడిగిన అమ్మ.. ఆ కలను నిజం చేసిన కొడుకు
ఓ తల్లి తన కుమారుడు స్కూల్లో చదువుకుంటున్న సమయంలో ఓ మాట చెప్పింది. పైలట్ కావాలని, తనను విమానంలో మక్కాకు తీసుకెళ్లాలని పేర్కొంది. చివరకు ఆ పిల్లాడు పెద్దవాడై పైలట్ అయ్యాడు. తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ట్వీట్ చేశాడు.
- T Venkateshwarlu
- Published on- December 27, 2022 / 07:59 PM IST
Mother’s dream
Mother’s dream: పిల్లల గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. వారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలని తమను తలెత్తుకునేలా చేయాలని భావిస్తారు. పెద్దవాడివయ్యాక డాక్టర్ వి కావాలని, తనకు జ్వరం వస్తే చూడాలని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం చూస్తూనే ఉంటాం. అలాగే, ఓ తల్లి తన కుమారుడు స్కూల్లో చదువుకుంటున్న సమయంలో ఓ మాట చెప్పింది. పైలట్ కావాలని, తనను మక్కాకు తీసుకెళ్లాలని పేర్కొంది.
చివరకు ఆ పిల్లాడు పెద్దవాడై పైలట్ అయ్యాడు. తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ట్వీట్ చేశాడు. తాను బడిలో చదువుకుంటున్న రోజుల్లో మా అమ్మ నాకో కార్డు రాసిందని చెప్పాడు. ‘‘ఎప్పుడు పైలట్ అవుతావు అని, తనను విమానంలో మక్కాకు ఎప్పుడు తీసుకెళ్తావు అని అమ్మ అడిగేది. విమానంలో పవిత్ర కాబాకు వెళ్లే ప్రయాణికుల్లో ఇవాళ మా అమ్మ కూడా ఒకరు. ఆ విమానం పైలట్ ను నేనే’’ అని పేర్కొన్నాడు.
తన బాల్యంలో తన తల్లి రాసిన ఆ కార్డును కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తల్లి కలను నిజం చేసినందుకు ఆ పైలట్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పైలట్ జీవితంలోని అత్యద్భత క్షణాలు ఇవేనని కొందరు కామెంట్లు చేశారు.
Poonam Bajwa: పొట్టి డ్రెస్సులో పూనమ్ అందాలు.. చూసినోళ్లకు చూసినంత!
