Pink Dolpin
Pink dolphins: చల్లని సముద్ర గర్భంలో కోట్లాది జీవరాసులు బతుకుతూ ఉంటాయి. కోట్ల మందికి ఉపాది కల్పిస్తూ ఉండే సముద్ర గర్భంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు.. సాధారణ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉండే సముద్ర ప్రపంచంలో మొక్కలు, కీటకాలు, జంతువులు అన్నీ కూడా సాధారణ ప్రపంచానికి భిన్నంగా ఉంటాయి. అటువంటి అసాధారణమైన ఓ డాల్ఫిన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో (ట్రెండింగ్ వీడియో) చూసి, ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నీటిలో దర్శనమిచ్చిన పింక్ డాల్ఫిన్:
సోషల్ మీడియా సైట్ ట్విట్టర్(వైరల్ వీడియో)లో డాల్ఫిన్‌ల అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉండాయి. డాల్ఫిన్‌ల కదలికలు ఎప్పుడూ కూడా ఆశ్చర్యకరంగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలలో డాల్ఫిన్ ఆడుతుంటే ఎవరి హృదయం హ్యాపీ అయిపోతుంది. IFS అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో డాల్ఫిన్ వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు మీరు బ్లాక్ లేదా బ్లూ డాల్ఫిన్‌లను మాత్రమే చూసారు, కానీ ఈ వీడియోలో కనిపించే డాల్ఫిన్ పింక్ కలర్‌లో ఉంది. అందుకే ఈ డాల్ఫిన్ ప్రత్యేకంగా కనిపిస్తొంది.
డాల్ఫిన్‌లను చాలామంది పెంపుడు జంతువులానే భావిస్తారు. ఈ వీడియోలో కూడా, పింక్ డాల్ఫిన్ నీటిలో చిన్నపిల్లల్లా ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు 46 వేలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూడగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కామెంట్లలో చాలామంది నెటిజన్లు ఇప్పటివరకు పింక్ డాల్ఫిన్‌ను చూడలేదని చెప్పారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
If you haven’t seen a pink dolphin?
(Credit in the video) pic.twitter.com/PBZWfmosm0— Susanta Nanda IFS (@susantananda3) August 19, 2021
ఓ యూజర్ చెప్పినదాని ప్రకారం.. అమెజాన్ నదిలో గులాబీరంగు డాల్ఫిన్లు కనిపిస్తూ ఉంటాయని తెలుస్తోంది. అయితే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీనిపై స్పందిస్తూ.. పింక్ డాల్ఫిన్ అనేది అత్యంత అరుదైన అంతరించిపోతున్న జాతికి చెందిన డాల్ఫిన్‌గా తెలుస్తుంది.