Ram Charan : మైసూరు చాముండేశ్వరి ఆలయంలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ లుక్ చూశారా?

ఇన్ని రోజులు శంకర్ ఇండియన్ 2 సినిమాతో, చరణ్ పాప పుట్టడంతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో ఆగిన గేమ్ ఛేంజర్ సినిమా షూట్ ఇటీవలే మళ్ళీ మొదలైంది.

Ram Charan Visits Sri Chamundeshwari temple in Mysore Game Changer Looks goes Viral

Ram Charan : రామ చరణ్(Ram Charan) హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రకటించి రెండేళ్లు అవుతుంది. కానీ ఇప్పటిదాకా సినిమా టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఇంకా షూటింగ్ కూడా అవ్వకపోవడంతో సినిమా వాయిదాపడినట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు.

ఇన్ని రోజులు శంకర్ ఇండియన్ 2 సినిమాతో, చరణ్ పాప పుట్టడంతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో ఆగిన గేమ్ ఛేంజర్ సినిమా షూట్ ఇటీవలే మళ్ళీ మొదలైంది. మైసూరు(Mysuru)లో ఈ సినిమా షూట్ గత వారం రోజులుగా జరుగుతుంది. ఇటీవల చరణ్ హైదరాబాద్ నుంచి మైసూర్ కి ఫ్లైట్ లో వెళ్ళాడు. హైదరాబాద్, మైసూర్ ఎయిర్ పోర్ట్ లో చరణ్ విజువల్స్ వైరల్ కూడా అయ్యాయి.

తాజాగా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా లుక్ లో మైసూరులో ఉన్న శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి పూజారులు ప్రత్యేక పూజలు చరణ్ ని ఆశీర్వదించారు. దీంతో చరణ్ ఆలయంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో చరణ్ ఓ కొత్త లుక్ లో కనిపించడంతో ఇది కూడా గేమ్ ఛేంజర్ సినిమా కోసమే అని అర్ధమవుతుంది. ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మైసూరులో శరవేగంగా జరుగుతుంది.

Also Read : Varun Lavanya : వరుణ్ – లావణ్య హనీమూన్‌కి వెళ్తున్నారా? ఎయిర్ పోర్ట్‌లో లావణ్యతో వరుణ్ స్పెషల్ సెల్ఫీ..

ఇక గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం వచ్చే సంవత్సరమే సమ్మర్ తర్వాత విడుదల అవుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మరి ఇప్పటికైనా అప్డేట్స్ ఇస్తారా లేదా చూడాలి గేమ్ ఛేంజర్ చిత్రయూనిట్.

 

ట్రెండింగ్ వార్తలు