Varun Lavanya : వరుణ్ – లావణ్య హనీమూన్‌కి వెళ్తున్నారా? ఎయిర్ పోర్ట్‌లో లావణ్యతో వరుణ్ స్పెషల్ సెల్ఫీ..

తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ట్రావెల్ ఆన్ అని పోస్ట్ చేశాడు.

Varun Lavanya : వరుణ్ – లావణ్య హనీమూన్‌కి వెళ్తున్నారా? ఎయిర్ పోర్ట్‌లో లావణ్యతో వరుణ్ స్పెషల్ సెల్ఫీ..

Varun Lavanya went to Honeymoon special Selfie posted and it goes Viral

Updated On : December 4, 2023 / 9:40 AM IST

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల నెలరోజుల క్రితం నవంబర్ 1న ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇటలీలో వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు ఈ జంట.

పెళ్లి దగ్గర్నుంచి ఈ జంట అప్పుడప్పుడు పలు ఫోటోలు పోస్ట్ చేస్తుంది. పెళ్లి అయిన దగ్గర్నుంచి వరుణ్ లావణ్య ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇప్పటికే వరుణ లావణ్య దగ్గర్నుంచి పెళ్లి తర్వాత అనేక ఫోటోలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఫోటో వైరల్ గా మారింది.

తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ట్రావెల్ ఆన్ అని పోస్ట్ చేశాడు. ఎయిర్ పోర్ట్ లో ఇద్దరూ ఇలా సెల్ఫీ దిగి పోస్ట్ చేయడంతో పాటు, ట్రావెల్ మొదలైందని పెట్టడంతో అందరూ వీరు హనీమూన్ కి వెళ్తున్నారని అనుకుంటున్నారు. మెగా సన్నిహితుల నుంచి కూడా వీరు హనీమూన్ కి వెళ్లారని సమాచారం అందుతుంది. అయితే ఎక్కడికి వెళ్లారు అనేది ఇంకా తెలియలేదు. త్వరలో ఈ జంట మరిన్ని ఫోటోలు పెడతారని అభిమానులు భావిస్తున్నారు.

Also Read : Nani : విజయ్ – రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని.. క్షమాపణలు కూడా చెప్తూ..

ఇక వరుణ్ నెక్స్ట్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ ఈ డిసెంబర్ లో రిలీజవ్వాల్సి ఉండగా ప్రస్తుతానికి వాయిదా పడింది. దీంతో వరుణ్ కొన్ని రోజులు లావణ్యతో ఇలా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడని సమాచారం.