Bank Holidays in 2026 May : వినియోగదారులకు అలర్ట్.. మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు..!

Bank Holidays in 2026 May : వినియోగదారులకి అలర్ట్.. మే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు రాబోతున్నాయి.

RBI Release bank holidays in 2026 may 12 days closed full details here

Bank Holidays in 2026 May : మే నెలలో బ్యాంకు సెలవులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన చేసింది. ఈ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి. లేనిపక్షంలో బ్యాంకులు బంద్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మే నెలలో సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి:

మే 2026 సెలవుల జాబితా:

  • మే 1, శుక్రవారం: బుద్ధ పూర్ణిమ, మే డే (చాలా వరకు దేశవ్యాప్తంగా సెలవు).
  • మే 3, ఆదివారం: సాధారణ సెలవు.
  • మే 9, శనివారం: రెండో శనివారం, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (సాధారణ సెలవు).
  • మే 10, ఆదివారం: సాధారణ సెలవు.
  • మే 16, శనివారం: కొన్ని రాష్ట్రాల్లో ‘రాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా సెలవు.
  • మే 17, ఆదివారం: సాధారణ సెలవు.
  • మే 23, శనివారం: నాలుగో శనివారం (సాధారణ సెలవు).
  • మే 24, ఆదివారం: సాధారణ సెలవు.
  • మే 26, మంగళవారం: కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు).
  • మే 27, బుధవారం: బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) – దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సెలవు.
  • మే 28, గురువారం: బక్రీద్ పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో అదనపు సెలవు.
  • మే 31, ఆదివారం: దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.

అందుబాటులో ఉండే సేవలు:

బ్యాంకు శాఖలు మూసివేసినా, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఇతర డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి:

  • యూపీఐ (UPI) లావాదేవీలు
  • నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్
  • ఏటీఎం (ATM) సేవలు

నగదు విత్‌డ్రా కోసం ఏటీఎం సేవల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.