శివాలయంలో పాము..ఆందోళనలో భక్తులు 

  • Publish Date - June 28, 2020 / 03:52 PM IST

పరమశివుడి మెడలో ఉండే నాగేంద్రుడు శివాలయంలోకి వచ్చాడు.  దీంతో  భక్తులు ఆందోళన చెందారు. తెలంగాణలోని జయశంకర్ భుపాలపల్లి జిల్లా, గణపురంలోని పురాతన కాకతీయులు కాలంనాటి  కోటగుళ్ల గణపేశ్వరాలయం గర్భగుడిలోకి శుక్రవారం దాదాపు 10 అడుగుల పొడుగు ఉన్న జెర్రిపోతు ప్రవేశించింది. శివలింగం వెనుక భాగంలో చాలా సేపు ఉండిపోవటంతో అర్చకులు సైతం లోపలకువెళ్ళటానికి భయపడ్డారు. ఒక వ్యక్తి ఆ పామును పట్టుకుని సమీపంలోని పొదల్లోకి వదిలేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read: తెలంగాణ సీఎం గ్రేట్ : నేవీ వైస్ అడ్మిరల్ లేఖ