TTD VIP SSD Tokens Cancellation : తిరుమల భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఆ టికెట్లు రద్దు..!

TTD VIP SSD Tokens Cancellation : వేసవి రద్దీ దృష్టా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఆ వివరాలు..

Due to Summer rush ttd may decide to cancelled vip break and ssd tokens from 2026 may 1st

  • వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం
  • వీఐపీ, ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు
  • మే 1 నుంచి అమలు చేసేందుకు సిద్ధం

TTD VIP SSD Tokens Cancellation : మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు మొదలవుతాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇక చాలామంది వేసవి సెలవుల్లో కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తరలివస్తారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా.. ఆ దేవదేవుడి దయ కోసం ఎంతో దూరం నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేసవిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో దర్శనానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా పలు దర్శన టోకన్లను రద్దు చేయాలని యోచిస్తోంది.

వేసవి కాలంలో తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. టీటీడీ కొత్త రూల్స్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. మే 1 నుంచి వీఐపీ (VIP) బ్రేక్ దర్శనాలతో పాటు స్లాటెడ్‌ సర్వదర్శనం (SSD) టోకెన్లను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అనుసరించిన నమూనానే.. ఈ వేసవి దర్శనాలలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా టీటీడీ ఉన్నతాధికారులు గత మూడు సంవత్సరాల వేసవి కాలం దర్శనాల డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మే, జూన్, జూలై నెలల్లో ప్రతినెలా సగటున 23-24 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలుస్తోంది.

*తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. దర్శనాలు, గదులపై కీలక నిర్ణయం.. త్వరలోనే ఉత్తర్వులు.. ఇక ఏఐ టెక్నాలజీ..

ప్రస్తుతం వీఐపీ దర్శనాలకు ప్రతిరోజూ 2-3 గంటల సమయం కేటాయిస్తున్నారు. అయితే ఈ సమయంలో కేవలం 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు. అంత తక్కువ మంది కోసం అన్ని గంటల సమయం కేటాయించే బదులు.. ఆ సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తే ఏకంగా 15 వేల మంది వెంకన్నను దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయడం శ్రేయస్కరమని బోర్డు యోచిస్తోంది.

అదేవిధంగా ప్రస్తుతం ఎస్‌ఎస్‌డీ (SSD) టోకెన్లు తీసుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఏకంగా 23 గంటల సమయం పడుతోంది. ఒకవేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి.. ఆ సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే, వారు సుమారు 8-12 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా వివిధ దర్శన కేటగిరీలను రద్దు చేసి.. వైకుంఠ ఏకాదశి తరహా విధానాన్ని అమలు చేస్తే, ప్రతిరోజూ సగటున 80 వేల మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించవచ్చని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై టీటీడీ అధికారికంగా ప్రకటన చేయనుంది.