×
Ad

Ishan kishan : ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో వైరల్

Ishan kishan : యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటుతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి

Ishan kishan

Ishan kishan : టీమిండియా యువ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.. ఫలితంగా జార్ఖండ్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక భూమి పోషించాడు.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 (SMAT) ఫైనల్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 49 బంతుల్లో మొత్తం 101 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల నుంచే 84 పరుగులను ఇషాన్ కిషన్ రాబట్టాడు.

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో టైటిల్ పోరులో జార్ఖండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు విరాట్ సింగ్ రెండు పరుగులకే ఔట్ అయ్యాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేవలం 24 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత కూడా తన జోరును కొనసాగించిన ఇషాన్.. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 101 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సుమిత్ కుమార్ బౌలింగ్ లో ఇషాన్ బౌల్డ్ అయ్యాడు.

జార్ఖండ్ జట్టు ప్లేయర్లు అనుకుల్ రాయ్ (40), రాబిన్ మింజ్ (31) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ జట్టు 262 భారీ స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు లక్ష్య చేధనలో విఫలమైంది. దీంతో జార్ఖండ్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.