BCCI : నాలుగో టీ20 మ్యాచ్ రద్దు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంతో బీసీసీఐ (BCCI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
BCCI Set To Take Big Step After IND vs SA 4th T20 match cancellation due to excessive fog
BCCI : పొగమంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. కనీసం టాస్ కూడా పడలేదు. ఈ క్రమంలో బీసీసీఐపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికి కూడా మ్యాచ్‌లను పెట్టడం ఎందుకు అని మండిపడుతున్నారు.
ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉత్తర భారత దేశంలో జరగాల్సిన పలు మ్యాచ్‌ల షెడ్యూలను సవరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
IND vs SA : గిల్ గాయం ఇతడికి వరం కానుందా! ఈ సారైనా..
ఈ విషయమై చర్చించేందుకు త్వరలోనే బోర్డు సమావేశం కానున్నారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఆ సమావేశంలో మ్యాచ్‌లను పశ్చిమ భారతదేశంలో నిర్వహించాలా, దక్షిణ భారతదేశంలో నిర్వహించాలా వంటి విషయాలను నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
కాగా.. ఈ సమయంలో దేశవాలీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు విజయ హజారే ట్రోఫీ జరగనుంది. ఇక జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్ కోసం ఇప్పటికే వేదికలను ఖరారు చేశారు. వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లలో జరగనున్నాయి.
మరి బీసీసీఐ సమావేశంలో ఈ మ్యాచ్‌ల వేదికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
