Jasprit Bumrah : అభిమాని ఫోన్ లాక్కొన్న జ‌స్‌ప్రీత్ బుమ్రా.. చెబుతుంటే నీకు అర్థం కాదా.. వీడియో వైర‌ల్‌

మైదానంలో ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా స‌హ‌నం కోల్పోని ఆట‌గాళ్ల‌లో టీమ్ఇండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఒక‌రు.

Jasprit Bumrah : అభిమాని ఫోన్ లాక్కొన్న జ‌స్‌ప్రీత్ బుమ్రా.. చెబుతుంటే నీకు అర్థం కాదా.. వీడియో వైర‌ల్‌

Team India pacer Jasprit Bumrah Loses Patience With Selfie Seeking Fan

Updated On : December 18, 2025 / 1:32 PM IST

Jasprit Bumrah : మైదానంలో ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా స‌హ‌నం కోల్పోని ఆట‌గాళ్ల‌లో టీమ్ఇండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఒక‌రు. అయితే.. అలాంటి బుమ్రా మైదానం వెలుపుల స‌హ‌నం కోల్పోయాడు.

ఎయిర్ పోర్టులో ఓ అభిమాని త‌న అనుమ‌తి లేకుండా సెల్ఫీ వీడియో తీసుకోవ‌డాన్ని బుమ్రా (Jasprit Bumrah)గ‌మ‌నించాడు. వీడియో తీయ‌కండి అంటూ అత‌డిని సున్నితంగా హెచ్చ‌రించాడు. అయితే.. స‌ద‌రు అబిమాని బుమ్రా మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో అస‌హ‌నానికి గురైన బుమ్రా.. స‌ద‌రు అభిమాని ఫోన్‌ను లాక్కుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Smriti Mandhana : పెళ్లి ర‌ద్దు త‌రువాత‌.. తెల్ల‌టి డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న స్మృతి మంధాన‌..


దీనిపై నెటిజ‌న్లు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. బుమ్రా ఫోన్‌ను లాక్కొవ‌డానికి కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు. ఇంకొంద‌రు మాత్రం అత‌డి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి ప్రైవ‌సీ ఉంటుంద‌ని, అభిమానులు దాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని సూచిస్తున్నారు.

IND vs SA : నాలుగో టీ20 మ్యాచ్ ర‌ద్దు పై ఉత‌ప్ప ఆగ్ర‌హం.. ఇంత‌కంటే దారుణ ప‌రిస్థితుల్లో ఆడాం.. ఇక్క‌డ మెరుగ్గానే..

ప్ర‌స్తుతం భారత జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో బుమ్రా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. మూడో టీ20 మ్యాచ్‌కు అత‌డికి విశ్రాంతి ఇచ్చారు. ఇక ల‌క్నో వేదిక‌గా జ‌ర‌గాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగ‌మంచు కార‌ణంగా ర‌ద్దైంది. ఐదో టీ20 మ్యాచ్ శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 19)న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.