Team India pacer Jasprit Bumrah Loses Patience With Selfie Seeking Fan
Jasprit Bumrah : మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోని ఆటగాళ్లలో టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒకరు. అయితే.. అలాంటి బుమ్రా మైదానం వెలుపుల సహనం కోల్పోయాడు.
ఎయిర్ పోర్టులో ఓ అభిమాని తన అనుమతి లేకుండా సెల్ఫీ వీడియో తీసుకోవడాన్ని బుమ్రా (Jasprit Bumrah)గమనించాడు. వీడియో తీయకండి అంటూ అతడిని సున్నితంగా హెచ్చరించాడు. అయితే.. సదరు అబిమాని బుమ్రా మాటలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అసహనానికి గురైన బుమ్రా.. సదరు అభిమాని ఫోన్‌ను లాక్కుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH : Jasprit Bumrah takes away fan’s phone at airport, warns him
Indian fast bowler Jasprit Bumrah recently found himself at the centre of a viral airport incident after a fan continued recording him despite repeated requests to stop. Bumrah reportedly snatched and threw the… pic.twitter.com/7lCksZQGp4
— upuknews (@upuknews1) December 18, 2025
దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బుమ్రా ఫోన్‌ను లాక్కొవడానికి కొందరు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మాత్రం అతడి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుందని, అభిమానులు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో బుమ్రా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. మూడో టీ20 మ్యాచ్‌కు అతడికి విశ్రాంతి ఇచ్చారు. ఇక లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దైంది. ఐదో టీ20 మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 19)న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.