Women Petrol Pump : మహిళలకు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. నెలకు లక్షల్లో సంపాదించుకునే అవకాశం..
Women Petrol Pump : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారు నెలకు లక్షల్లో ఆదాయం పొందే కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
- Dharani Pilli
- Updated on- May 25, 2026 / 03:02 PM IST
Telangana Government will decide to Set Up Petrol Pumps in All Constituencies over all state Run by Womens Federation
- మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త
- ప్రతి నియోజకవర్గంలో పెట్రోల్ బంకులు
- త్వరలోనే స్థాపనకు చర్యలు
Women Petrol Pump : తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మరీ ముఖ్యంగా మహిళా సంఘాలు ఆర్థిక సాధికారిత సాధించేందుకు.. అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలు లక్షల్లో డబ్బులు సంపాదించుకునేందుకు గాను వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకూ రేవంత్ సర్కార్ తీసుకున్న ఆ निर्णयం ఏంటంటే.. మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్.. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో రేవంత్ సర్కార్.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని… గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్కార్ ఆదేశాల మేరకు సెర్ప్ దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
*ఆకునూరి మురళి సడెన్ రిజైన్ వెనుక అసలు రీజన్ వేరే ఉందా? ఆ మూడు కారణాలే రాజీనామాకు దారితీశాయా?
రేవంత్ సర్కార్ ఇప్పటికే పలు జిల్లాల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లు విజయవంతంగా నడుస్తుండటంతో.. రాష్ట్రంలోని మరో 39 ప్రాంతాల్లో కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇప్పటికే వాటి ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఇప్పటికే సెర్ప్.. దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలైన HPCL, IOCL, BPCLతో చర్చలు జరిపింది. ఈ ఆయిల్ కంపెనీల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ, లీజు ఒప్పందాలు, లేఅవుట్ల రూపకల్పనకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
*హ్యాట్సాఫ్ సర్.. పేద విద్యార్థుల బతుకులు మార్చిన వాంటర్ ట్యాంక్.. 20లక్షలకుపైగా సంపాదన
ఆదిలాబాద్, కుమరంభీం, ఖమ్మం, హనుమకొండ, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి భూమిని గుర్తించడం, నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతోంది. ఇక కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ఇప్పటికే NOCలు లభించగా.. సూర్యాపేట, మేడ్చల్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే లీజు ఒప్పందాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో NHAI, ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు తీసుకునే పనులు జరుగుతున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. నూతన పెట్రోల్ బంక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
