cobra Guards tomatoes
Tomato Highest Price : దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. టమాటా అత్యధిక ధర పలుకుతోంది. కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఈ క్రమంలో టమాటాలపై మీమ్స్ వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నాగుపాము టమాటాలకు రక్షణగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మీర్జా ఎమ్ డీ ఆరిఫ్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు.
ఒక ఇంట్లో టమాటాలు ఉన్న చోటుకు ఓ నాగుపాము చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో అత్యంత ఖరీదుగా ఉన్న టమాటాలకు కాపాలాగా ఉంది. వాటి దగ్గరకు వచ్చే వారిపై దాడి చేసి కాటేసేందుకు పడగ విప్పుతోంది. నిధి కంటే విలువైన టమాటాలను పాము రక్షిస్తోంది… అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Tomato Price Hike : మండుతున్న టమాటా ధరలు .. ట్విట్టర్లో కామెడీ మీమ్స్
కాగా, టమాటాలకు రక్షణగా ఉన్న పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టమాటాలు చాలా ఖరీదైనవి, వాటిని ముట్టుకోవద్దు అని ఒకరు కామెంట్ చేశారు. విలువైన టమాటాలకు పాము కాపాలాగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. అలాగే, తమ తమ ప్రాంతాల్లో టమాటా ధరలను కొందరు ప్రస్తావించారు. ఇతర ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.