UP Woman Cell Tower : ఆడాళ్లలో ఆణిముత్యం.. ప్రియుడి కోసం ఎంత రిస్క్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కిన వివాహిత
UP Woman Cell Tower : ప్రియుడి కోసం ఓ మహిళ సాహసం చేసింది. అతడితోనే కలిసి ఉంటానంటూ ఏకంగా సెల్ టవర్ ఎక్కి మరీ ఆందోళన చేసింది.
- Dharani Pilli
- Updated on- April 29, 2026 / 03:12 PM IST
uttar pradesh married woman climbs cell tower for her lover
- యూపీలో అనూహ్య సంఘటన
- భర్త వద్దు లవర్ కావాలంటూ
- సెల్ టవర్ ఎక్కిన మహిళ
UP Woman Cell Tower : ఈ మధ్యకాలంలో ప్రేమించిన అమ్మాయి కోసం, అలిగి వెళ్లిన భార్య కోసం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వారి గురించి చూశాం. మరి అన్నింట్లో మగవాళ్లే ఉంటారా.. ప్రేమ విషయంలో.. ప్రేమించిన వాడిని దక్కించుకునేందుకు మా ఆడవాళ్లు కూడా ఏం చేయడానికైనా వెనకాడరని నిరూపిస్తున్నారు ఈ కాలం అతివలు కొందరు. ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న వాడిని, కన్న వారిని బలితీసుకుంటున్న ఆడవాళ్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో.. ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం ఓ వివాహిత మహిళ చేసిన సాహసం ‘నెవ్వర్ బీఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్’. ఇంతకు సదరు మహిళ ఏం చేసిందంటే..
తనకు భర్త వద్దు.. ప్రేమించిన వాడే కావాలంటూ ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ (30) అనే మహిళకు బర్మనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే సదరు మహిళకు ఆ పెళ్లి ఇష్టం లేదు. కారణం ఆమె తన సొంతూరు సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది.
కానీ ఆమెకు బలవంతంగా మరో వ్యక్తితో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఉండటం కోసం పెళ్లైన రెేండేళ్ల తర్వాత ఆ మహిళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చి.. దగ్గర్లో ఉన్న సెల్ టవర్ ఎక్కింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సదరు వివాహిత మహిళను కిందకు దించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దాదాపు మూడు గంటల పాటు నెత్తి మాడిపోయే మండుటెండను సైతం భరిస్తూ.. ఆమె సెల్ టవర్ పైనే ఉండిపోయింది. చివరికి అధికారులు నచ్చజెప్పడంతో ఆమె కిందకు దిగివచ్చింది. తనను తన ప్రియుడి దగ్గరకు పంపాలని కోరింది. మరి పోలీసులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
