వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ.20వేలు అప్పు తీసుకున్న విద్యార్ధినిలు ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్ధినిలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.
స్కూలుకని వెళ్లిన ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకుందాని అనుకున్నారు. నిద్రమాత్రలు కొనుక్కున్నారు. ముగ్గురు మింగారు. అర్థరాత్రి బస్టాండ్ లో అపస్మారస్థితిలో ఉన్న ముగ్గురు విద్యార్ధినిలను ప్రయాణీకులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందించిన అనంతరం కొద్దిగా కోలుకున్నారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఓ వడ్డీ వ్యాపారి నుంచి రూ.20వేలు అప్పు తీసుకున్నామని..ఇప్పుడు ఆ వ్యాపారి తమను బెదిరిస్తున్నాడనీ..వేధిస్తున్నాడని అందుకే ఆత్మహత్యకు యత్నించామని లావణ్య, నవ్యశ్రీ, వరలక్ష్మి అనే ముగ్గురు విద్యార్థినులు తెలిపారు.
లావణ్యకు దూరపు బంధువైన మహేశ్ కు మధ్యా ప్రేమ వ్యవహారం నడిచింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్యా చాటింగ్ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో లావణ్య..వరలక్ష్మికి మహేశ్ నుంచి రూ.20వేలు అప్పుగా ఇప్పించింది. తరువాత ఈ డబ్బు గురించి లావణ్య, నవ్యశ్రీ, వరలక్ష్మిల మధ్య విభేదాలు వచ్చాయి. ముగ్గురు మధ్యా బాగా గొడవ జరిగింది. దీంతో మహేశ్ మీరంతా గొడవ పడుతున్నారు..నా డబ్బుల విషయం ఏంటీ..నా డబ్బులు నాకు ఇచ్చేయాలని అడిగాడు. దీంతో డబ్బులు ఎలా ఇవ్వాలో తెలీక ముగ్గురు బుధవారం (జనవరి 8,2020) సాయంత్ర బస్టాండ్ వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.
కాగా..స్కూలుకని వెళ్లిన పిల్లలు ఇంకా రాకపోవటంతో లావణ్య, నవ్యశ్రీ, వరలక్ష్మిల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వాళ్లు పట్టించుకోకపోవటంతో డీఎస్పీకి కంప్లైంట్ చేశారు. దీంతో స్పందించిన డీఎస్పీ ఆదేశాలతో లావణ్య, నవ్యశ్రీ, వరలక్ష్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బస్టాండ్ లో వారు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే స్థానికులు బస్టాండ్ లో అపస్మారక స్థితిలో ముగ్గురు విద్యార్థినులు పడి ఉన్నారని సమాచారం అందించారు.
దీంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందించగా..వారు కోలుకున్నాక..పోలీసులు వివరాలను రాబట్టారు. దీంతో వారు వడ్డీ వ్యాపారి డబ్బుల కోసం తరచూ అడగటంతో ఆత్మహత్యకు యత్నించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..అసలు విద్యార్థినిలు మహేశ్ దగ్గర నుంచి రూ.20వేలు ఎందుకు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలుసా? లేక తెలీదా? తెలియకపోతే అంత పెద్ద మొత్తం డబ్బులు అప్పు చేయాల్సిన అవసరం ఈ విద్యార్థినిలు ఏం ఉంది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.