సీఎం చంద్రబాబు.. మళ్లీ మీరే రావాలి.. మా భవిష్యత్ మీ బాధ్యత అంటూ నినదించారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 300 మంది మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆచంటలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు.
వందల మంది మహిళలు స్వచ్ఛంధంగా రోడ్లపైకి వచ్చి టీడీపీ తరపున ప్రచారం చేయటం సంతోషకరమైన విషయం అన్నారు. మహిళలే టీడీపీ బలం అన్నారు. వారి మద్దతుతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ అభ్యర్థి సునీల్. మహిళల స్పందన చూస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావటం ఖాయం అని తేలిపోయిందన్నారు సునీల్.
పుట్టుక నుంచి చావు వరకూ చంద్రబాబు ప్రజల కోసం పథకాలు అమలు చేస్తున్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు అని చెప్పకొచ్చారు నేతలు. మహిళల కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత కూడా టీడీపీదే అన్నారు.