మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసు ఆమెది. అలాంటి వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లి, పిల్లలు క్షేమంగా
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసు ఆమెది. అలాంటి వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. కవల పిల్లలు పుట్టడంతో రమాదేవి దంపతులు, కుటుంబసభ్యులు ఆనందంగా ఉన్నారు. కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలో శుక్రవారం(అక్టోబర్ 11,2019) రమాదేవి కవలలకు జన్మనిచ్చింది.
భద్రాచలంకు చెందిన రమాదేవి దంపతులకు ఒక కుమారుడు ఉండేవాడు. రోడ్డు ప్రమాదంలో అతడు చనిపోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు దూరం కావడంతో రమాదేవి, ఆమె భర్త తట్టుకోలేకపోయారు. కొడుకు మరణంతో తీవ్ర విషాదంలో ముగినిపోయారు. కాగా, చాలా ఏళ్ల తర్వాత సంతానం కావాలని వారిద్దరూ అనుకున్నారు.
వయసు మీద పడడంతో రమాదేవి దంపతులు ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషించారు. కరీంనగర్ పట్టణంలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రం గురించి తెలుసుకున్నారు. డాక్టర్ పద్మజను సంప్రదించారు. డాక్టర్ పద్మజ ఐవీఎఫ్ విధానం గురించి వారికి చెప్పారు. వారు ఓకే చెప్పడంతో డాక్టర్ ప్రొసీడ్ అయ్యారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు ప్రయత్నించి రమాదేవి సక్సెస్ అయ్యారు. నెలలు నిండాక రమాదేవి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. డాక్టర్ పద్మజకి వారు కృతజ్ఞతలు తెలిపారు.