షాక్ ఇచ్చారు : రేకుల షెడ్డుకి కరెంట్ బిల్లు రూ.6లక్షలు

అదేమీ ఫ్యాక్టరీ కాదు. ఆఫీస్ కాదు. పెద్ద హోటల్ కూడా కాదు. పోనీ అపార్ట్ మెంట్ అంటే అదీ కాదు. ఓ చిన్నపాటి రేకుల షెడ్డు. కానీ దానికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే షాక్

  • Publish Date - September 17, 2019 / 04:09 AM IST

అదేమీ ఫ్యాక్టరీ కాదు. ఆఫీస్ కాదు. పెద్ద హోటల్ కూడా కాదు. పోనీ అపార్ట్ మెంట్ అంటే అదీ కాదు. ఓ చిన్నపాటి రేకుల షెడ్డు. కానీ దానికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే షాక్

అదేమీ ఫ్యాక్టరీ కాదు. ఆఫీస్ కాదు. పెద్ద హోటల్ కూడా కాదు. పోనీ అపార్ట్ మెంట్ అంటే అదీ కాదు. ఓ చిన్నపాటి రేకుల షెడ్డు. కానీ దానికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే షాక్ కొట్టకమానదు. అక్షరాల రూ.6 లక్షలు కరెంటు బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.

సంజయ్‌నగర్‌కు చెందిన రాజయ్యకు ఆగస్టు నెలకు సంబంధించి రూ.6,08,000 కరెంటు బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు చూసి రాజయ్య షాక్ తిన్నాడు. ఆ తర్వాత తేరుకుని.. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి అధికారుల దగ్గరికి వెళ్లాడు. కానీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోలేదట. రేకుల షెడ్డుకి ఇంత బిల్లు ఎలా వచ్చిందని అడిగితే వారు సమాధానం చెప్పలేదట. కనీసం ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని రాజయ్య వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని రాజయ్య వేడుకున్నాడు.

విద్యుత్ అధికారుల లీలలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. బిల్లు వేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తంలో విద్యుత్ బిల్లులు వేసి సామాన్యులకు షాక్ ఇస్తున్నారు. ఆ తర్వాత తీరిగ్గా స్పందిస్తున్నారు. సాంకేతికంగా వచ్చిన సమస్య అని, అందులో తమ తప్పు లేదని కవర్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పొరపాట్లు రిపీట్ అవ్వకుండా చర్యలు మాత్రం తీసుకోలేకపోతున్నారు విద్యుత్ అధికారులు.