తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేని 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. బాలుడిని కిడ్నాప్ చేసి జైపూర్ తీసుకెళ్లారు.డబ్బులు పట్టుకుని వచ్చి..బాలుడికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలోని ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే…రాజస్థాన్ రాష్ట్రం బుందీ జిల్లా, దేయి గ్రామానికి చెందిన పులుభాయ్, సోనూ దంపతులు ఆరు సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం విజయవాడ వచ్చారు. కృష్ణలంక కరెంట్ ఆఫీసు రోడ్డులో అద్దెకు ఉంటున్న ఈ దంపతులకు అంకీస్ 8 నెలలు అనే బాబు ఉన్నాడు. విజయవాడలో వీరికి రాజస్థాన్ కు చెందిన మాయ, ఖాన్, సోనులు పరిచయమం అయ్యారు. ఈ క్రమంలో వీరి వద్ద పులుభాయ్, సోనూ దంపతులు రూ.36వేలు అప్పుగా తీసుకుని ఆ డబ్బుతో మట్టి పెనాలు, లాంతర్లు వంటివి కొనుగోలు చేసి పొట్టిపాడు టోల్‌గేట్ సమీపంలో మట్టి పెనాలు, లాంతర్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు.
అప్పు చేసిన డబ్బుతో పులుభాయ్ దంపతులు తెచ్చుకున్నారు. దాంట్లోంచి కొంత సరుకుని మాయ, ఖాన్, సోనులు తీసుకున్నారు. ఆ తరువాత సరుకు డబ్బులు పోగా మిగిలిన డబ్బు ఇవ్వాలని అడిగారు. ప్రస్తుతం తమ దగ్గర అంత డబ్బు లేదనీ..తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో వీరి మధ్య గొడవ జరిగింది.
సోనూ అన్నయ్య ఫోరూలాల్‌కు ఖాన్, సోనుతో సెప్టెంబర్ 14న పొట్టిపాడు టోల్‌గేట్ సమీపంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. కొంతసేపటికి అది సర్ధుకుంది. తరువా 15ఉదయం భార్యాభర్తలు వ్యాపారం చేసుకునేందుకు వెళుతూ..బాబుని మాయ, ఖాన్, సోనుకు ఇచ్చి తాము వచ్చేంత వరకూ చూడమని చెప్పి వదలి వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూడగా బాబుంతో సహా వారు కనిపించలేదు. దీంతో వారు సోనుకు ఫోన్ చేయగా..మీరు మాకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బు ఇచ్చి బాబుని తీసుకెళ్లమని తెగేసి చెప్పేసరికి దంపతులిద్దరు గాబరా పడ్డారు. భయపడ్డవారు ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్ పంపిస్తామని తెలిపారు.