ప్రభుత్వం ఉత్తర్వులు : 8 జిల్లాల్లో కోర్టులు

ఏపీ వ్యాప్తంగా 8 ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారించేందుకు

  • Publish Date - September 26, 2019 / 12:57 PM IST

ఏపీ వ్యాప్తంగా 8 ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారించేందుకు

ఏపీ వ్యాప్తంగా 8 ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారించేందుకు ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, గుంటూరు జిల్లాల్లో వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.