ఏబీ వెంకటేశ్వర్ రావు కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.
Also Read : ఆశ్చర్యపరిచిన ప్రియాంక గాంధీ: తానే స్వయంగా వంటగదిలోకి వెళ్లి!
గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసింది. ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతల నుంచి వెంకటేశ్వరరావును తొలగించాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను తొలగించారు.
మార్చి 26న కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ డీజీగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. 1989 బ్యాచ్ కు చెందిన వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ 822 జీవోను విడుదల చేశారు.
Also Read : యనమల వర్సెస్ బొత్స: టీడీపీ ఓడిపోతుంది.. అధికారులూ సహకరించకండి