శ్రీశైలం డ్యామ్ భద్రత గురించి సంబంధిత అధికారులో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. డ్యామ్ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ కు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. డ్యామ్ భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలని వాటిని ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు. ప్రజల్లో అనుమానాలు, అపోహలు కల్పించవద్దని కోరారు.ప్రాజెక్టు నిర్వహణ వంటి అంశాలపై ప్రతిపక్షాలు వ్యాఖ్యలను ఖండిస్తున్నామనీ దయచేసిన ప్రజల్లో అపోహకలు కల్పించేలా వ్యాఖ్యానించవద్దని కోరారు.
తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టుల భద్రతను, నీటి వనరుల లభ్యతను అంచనా వేస్తున్నారు. మంగళవారం(నవంబర్19, 2019) ఏపీలోని శ్రీశైలం డ్యామ్ ను సందర్శించారు. బుధవారం(నవంబర్ 20, 2019) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ డ్యామ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించామని, ప్రాజెక్టులో భారీ గొయ్యి ఏర్పడుతోందన్నారు. డ్యామ్ లో క్షితిజ సమాంతరంగా పగుళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. డ్యామ్ కు మరమ్మతులు చేయకపోతే పెను విషాదం తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందని ఆయన ఆందళన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులు నిర్మించాక వాటి నిర్వహణను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ..నదులపై డ్యామ్ లు నిర్మిస్తున్నాయే తప్ప వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యామ్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై మంత్రి అనిల్ మాట్లాడుతూ.డ్యామ్ కు సంబంధించి అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.