హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ సభకు హాజరు కాలేకపోయినా కనీసం వరంగల్ సభకైనా అమిత్ షా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నా..అదికూడా రద్దు కావటంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశ పడ్డారు.
కాగా ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.