ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మీకు నాటకాల్లా కనిపిస్తున్నాయా? ధర్మానా..తమ్మినేనీ..ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ హెచ్చరించారు అమరావతి రైతులు.
టీవీల్లో కనిపించటానికి..ఇన్ సైట్ ట్రేడింగ్ పడిపోయిందని ఆందోళనలు : ధర్మాన, తమ్మినేని
అమరావతి ప్రాంతంలో ఆందోళన చేసేది అసలు రైతులే కాదనీ..వారంతాటీడీపీ కార్యకర్తలేనీ..భూములు కొట్టేసినవాళ్లే ధర్నాలు చేస్తున్నారనీ..టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా? భూములకు విలువ పడిపోయందని ఆందోళన చేస్తున్నారా? అంటూ తీవ్ర విమర్శలుచేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..అదంతా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న పనులేనని..రైతుల దగ్గర తీసుకున్న భూముల్ని ప్లాట్లుగా అభివృద్ధి చేసి ఇస్తామంటుంలే ఇంకా ఈ ఆందోళనలేంటి? రాజధాని అమరావతిపేరుతో ఈ రాజకీయాలేంటి? అంటూ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన విమర్శించారు.
వీరిద్దరు చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు మండి పడుతున్నారు. రాజధానికి భూములిచ్చి ఇప్పుడు నడిరోడ్డుమీద కూర్చోబెట్టిన మీ ప్రభుత్వానికి మా బాధలు కామెడీగా కనిపిస్తున్నాయా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మేం చేసే ఆందోళనలు..నిరసనలకు కులాలకు గానీ, మతాలకు గానీ..ఏ పార్టీలకు సంబంధంలేదని స్పష్టంచేశారు రైతులు.
ఆందోళన చేసేవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారనే విషయం తెలుసుకోవాలని..అవగాహనారాహిత్యంతో మాట్లాడవద్దని మండిపడ్డారు. మాకు జరిగిన అన్యాయంపై మేము ప్రశ్నిస్తున్నామనీ..పోరాడుడతున్నామనీ..మా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు రైతులు.