తెలుగు రాష్ట్రాల్లో రెండు బస్సు ప్రమాదాలు

  • Publish Date - October 10, 2019 / 05:11 AM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో ఈ రోజు (అక్టోబర్ 10, 2019)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారిని అక్కడి స్థానికుల సహాయంతో బయటికి తీశారు. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

ఇక అనంతపురం జిల్లాలో కూడా ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా రహదారిపై బోల్తాపడింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో 15 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాయపడిన వారిని హాస్పత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించారు.