మోడీ మీటింగ్ కు మా క్యాంపస్ ఇవ్వం : ఆంధ్రా వర్శిటీ

  • Publish Date - February 19, 2019 / 06:17 AM IST

విశాఖ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పార్టీ పట్టు సాధించుకోవటానికి బీజేపీ యత్నాలు చేస్తోంది. దీనికి ఏపీలోని విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి1న మోడీ సభను బీజేపీ నేతలు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణలో  ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
 

ప్రధాని మోడీతో బీజేపీ తలపెట్టిన విశాఖపట్నం బహిరంగ సభకు..తమ మైదానాన్ని ఇవ్వలేమని ఆంధ్రా యూనివర్శిటీ తెలిపింది. మార్చి న ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానున్నారు. దీంతో మోడీ భారీ సభను ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ఏర్పాటు పర్మిషన్ కోసం వర్శిటీ నేతలను బీజేపీ నేతలు సంప్రదించారు. కానీ ఈ మైదానాన్ని ఇవ్వలేమని..యూనివర్శిటీ పాలకులు బీజేపీకి రాసిన లెటర్ లో స్పష్టంచేశారు. దీనికి తగిన కారణాలకు మాత్రం వారు తెలుపలేదు.

Read Also : జగన్ ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా : కిల్లి కృపారాణి

Read Also : కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు