ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.

  • Publish Date - January 22, 2020 / 07:23 PM IST

అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.

అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా టీడీపీ నేతలు నాలుగువేల డెబ్బై ఎకరాలు కొనుగోలు చేశారని.. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణలో ఇంకా ఎక్కువ వివరాలు బయటపడపడే అవకాశం ఉందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.  

అమరావతి భూసమీకరణలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. హోం శాఖ మంత్రి సుచరిత ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో చర్చ జరిగింది. టీడీపీ నేతలు చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యం భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు  ఉన్న నేపథ్యంలో.. బినామీ లావాదేవీల నిరోధక చట్టంతోపాటు అసైన్‌మెంట్ ల్యాండ్‌ యాక్ట్‌, ఎస్సీ, ఎస్టీ వేధింపు నిరోధక చట్టాలను విచారణ పరిధిలోకి తెచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

అమరావతిలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరిగిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. చర్చ తర్వాత భూసమీకరణ తీర్మానాన్ని ఆమోదించినట్టు సభాధ్యక్షస్థానంలోఉన్న ఉపసభాపతి కోన రఘుపతి ప్రకటించారు. 

అమరావతి భూసమీకరణలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై  లోకాయుకత్తతో విచారణ జరిపించాలా.. లేక మరో సంస్థకు అప్పగించాలా.. అన్ని అంశంపై ప్రభుత్వం తర్వలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 

ట్రెండింగ్ వార్తలు