ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తసరాల సమయం కొనసాగుతుంది. అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడుతున్నారు. విద్యుత్ ఒప్పందాలపై సభలో చర్చ జరుగుతోంది. పీపీఏల్లో అవినీతి జరిగిందంటూ కమిటీ వేసిన ప్రభుత్వం ఏ సాధించిందని టీడీపీ నేత రామానాయుడు ప్రశ్నించారు. పీపీఏల్లో అవినీతిపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కమిటీ రిపోర్టు ఇవ్వగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పీపీఏల కోసం అర్ధరాత్రి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. టీడీపీ హయాంలో డిస్కంల నష్టాలు రూ.20 వేల కోట్లని..పీపీఏల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని కేంద్రం రాసిన లేఖలో ఉందన్నారు. టీడీపీ తప్పు చేసినా జనం మెచ్చుకోవాలా అని ప్రశ్నించారు. డిస్కంలు కుప్పకూల్చే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.
పీపీఏలపై వేసిన కమిటీపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. పీపీఏలపై సమీక్ష దేశానికి నష్టం జరుగుతుందని కేంద్ర చెప్పిందని గుర్తు చేశారు. పీపీఏల్లో చంద్రబాబు దోచుకుతిన్నారని విమర్శించడం సబబేనా అన్నారు.
సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. సమావేశాలు 9 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.